Ali: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ ల మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గత కొన్నేళ్లుగా వీరి మధ్య విబేధాలు నెలకొన్నాయని, ఆలీతో పవన్ మాట్లాడడం లేదని వార్తలు వచ్చాయి. ఇక ఎట్టకేలకు ఈ విబేధాలపై ఆలీ స్పందించాడు. ఇటీవల సుమతో ఆలీ ఇంటర్వ్యూ జరిగిన విషయం తెల్సిందే.. ఈ ఇంటర్వ్యూలో సుమ.. ” పవన్ కళ్యాణ్ కు, మీకు మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది” అని అడుగగా.. దానికి ఆలీ మాట్లాడుతూ.. ” గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే గ్యాప్ ఉంటేనే గా.. గ్యాప్ లేదు.. గ్యాప్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా మా పాప పెళ్ళికి కూడా నేను పవన్ ను పిలిచాను.. ఆయన సెట్ కు నేను వెళ్ళేసరికే.. ఆలీ వస్తున్నారు.. ఆయనకు టీ, కాఫీ ఏమైనా ఇవ్వండి అని బాయ్ కూడా చెప్పి లోపలికి వెళ్లారు. నా కోసం వేరేవారిని కూడా పక్కన కూర్చోపెట్టి నాతో ఆయన పావుగంట మాట్లాడారు. ఈ విషయాలు ఏవి బయట వారికీ తెలియవు.
అయితే ఒకటి జరిగింది.. నా కూతురి పెళ్ళికి రావడానికి ఆయన బయల్దేరారు.. మేనేజర్ కూడా వచ్చి అన్ని చూసుకున్నాడు. అయితే విమానం ఆలస్యం అవ్వడంతో పవన్ రాలేకపోయారు. కొన్ని వెబ్ సైట్లు.. పవన్ పిలవలేదా.. పిలిచినా రాలేదా..? అసలు రారా..? అని ఎవరికి ఇష్టం వచ్చిన్నట్లు రాసేశారు. అది చూసి చదివేవారు టక్కున చదివేస్తున్నారు. ఆ రాసేవాళ్లను మనం ఏమి అనలేము.. రాసేవాళ్ళు ఎన్నైనా రరాస్తారు.. మనం ఏమి చేయలేము.. మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.. రాదు” అని చెప్పుకొచ్చాడు.