Alekya chitti sisters : అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ అంటే తెలియని వారే ఉండరేమో. ఒక్క వాట్సాప్ ఆడియోతో సంచలనంగా మారారు. ఆ తర్వాత బిజినెస్ మూసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పేరు మార్చి రన్ చేస్తున్నారు. అయితే తాజాగా వీరికి ఎదురైన చేదు అనుభవాన్ని అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ పెద్దమ్మాయి సుమ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది. రీసెంట్ గా మేం ముగ్గురం సిస్టర్స్ థియేటర్ కు వెళ్లాం. అక్కడ మమ్మల్ని చూసి కొందరు గుర్తుపట్టి సెల్ఫీలు దిగారు.
Read Also : Raghava Lawrence : లారెన్స్.. నువ్వు బంగారం.. దివ్యాంగురాలికి ఏం చేశాడంటే..
ఇంకొందరు మాత్రం నీచంగా ప్రవర్తించారు. ఇంటర్వెల్ లో బయటకు వచ్చి లోపలకు వెళ్తుంటే.. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అంకుల్స్ మా దగ్గరకు వచ్చి నీచంగా సైగలు చేశారు. అలా చేయొచ్చు కదా.. ఇలా చేయొచ్చు కదా అంటూ అసభ్యకరంగా మాట్లాడారు. గొడవ ఎందుకు అని లోపలకు వెళ్లాం. థియేటర్ లో కూర్చుంటే.. వెనకాల కూర్చున్న అబ్బాయిలు మొగుడు ఉంటే మాట్లాడొద్దా అంటూ కామెంట్స్ చేశారు. సరే లే అని బయటకు వెళ్లిపోతుంటే… సినిమా చూడాలంటే సామాన్లు బాగుండాలి ఆంటీ అని నీచంగా మాట్లాడారు. చాలా కోపం వచ్చింది. కానీ అంతకు మించి బాధ వేసింది. మేం ఎవరినీ మోసం చేయట్లేదు, ఎవరి సొమ్ము తినట్లేదు, మాకు వచ్చిన బిజినెస్ చేసుకుంటున్నాం. నీచమైన పనులు చేయట్లేదు కదా.. ఎందుకు మమ్మల్ని ఇంతలా టార్చర్ పెడుతున్నారంటూ ఎమోషనల్ అయింది.
