Site icon NTV Telugu

‘బ్రాందీ డైరీస్’ లో ఆల్కహాలే హీరో!

ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గూర్చి ‘బ్రాందీ డైరీస్‌’ చిత్రంలో చూపించబోతున్నాడు డైరెక్టర్‌ శివుడు. గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా నటించారు. కలెక్టీవ్‌ డ్రీమర్స్‌ పతాకంపై లేళ్ల శ్రీకాంత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ.. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆల్కహాల్‌ నేపథ్యంలోనే ఉంటుంది. ప్రతి మనిషికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. వాటిలో ఆల్కహాల్‌ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తున్నారు. నా సినిమాలో మొత్తం ఆల్కహాల్ మీదే నడుస్తుంది, ఆల్కహాలే నా కథలో హీరో.. సినిమాటిక్‌గా మంచి కమర్షియల్ అంశాలతో చిత్రీకరించాము. ఈ చిత్రం రెగ్యులర్ సినిమాల ఉండదు, చాలా ఉత్కంఠగా ఉండబోతుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

Exit mobile version