NTV Telugu Site icon

Ugram: హాట్ సమ్మర్ లో మంచి వెకేషనల్ సాంగ్… అల్బెలా

Ugram

Ugram

ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ కి ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది, అది కూడా పాత్ బ్రేకింగ్ కాంబినేషన్ అయితే మరింత హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి అల్లరి నరేష్-విజయ్ కనకమేడలది. హిట్ సినిమా తీయడం వీరు, హీరో ఇమేజ్ నే మార్చేసే సినిమా తీయడం వేరు. అలాంటి సినిమానే అల్లరి నర్రేష్-విజయ్ కలిసి చేసి చేశారు. నాందితో మొదలైన ఈ హిట్ కాంబినేషన్ నుంచి ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమా వస్తోంది. నాంది స్టైల్ లోనే అల్లరి నరేష్ ని పూర్తిగా కొత్త మేకోవర్ లో, పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా విజయ్ ప్రెజెంట్ చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినీ అభిమానులని ఆకట్టుకుంది. ఉగ్రం సినిమా అబోవ్ యావరేజ్ టాక్ రాబడితే చాలు అల్లరి నరేష్-విజయ్ కనకమేడల కాంబినేషన్ లో సెకండ్ హిట్ పడినట్లే.

Read Also: Bavaa Garu Baagunnara: పాతికేళ్ళ ‘బావగారూ…బాగున్నారా?’

మిర్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎంత యాక్షన్ ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే హార్ట్ టచింగ్ ఎమోషన్ కూడా ఉగ్రం సినిమాలో ఉందని చెప్తూ మేకర్స్, ఈ మూవీ నుంచి ఒక ఫీల్ గుడ్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘అల్బెలా’ అంటూ సాగే ఈ సాంగ్ ని నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశాడు. హీరో తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిన టైం వచ్చే ఈ సాంగ్ ఇంప్రెస్ చేసింది. శ్రీచరణ్ పాకాలా సోల్ ఫుల్ కంపోజింగ్, మంచి లోకేషన్స్ లో, క్యాచీ లిరిక్స్ తో, పాప క్యూట్ డాన్స్ తో అల్బెలా సాంగ్ ‘ఉగ్రం’ సినిమా కలర్ ని మార్చింది. మరి మే 5న రిలీజ్ కానున్న ఉగ్రం మూవీతో అల్లరి నరేష్, విజయ్ కనకమేడల హిట్ హిస్టరీని రిపీట్ చేస్తారేమో చూడాలి.