Site icon NTV Telugu

ఆకట్టుకున్న ‘అలసిన సంచారి’ లిరికల్ సాంగ్

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ ఈ కథను అందించారు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ‘అలసిన సంచారి’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ పాట ఉంది. శ్రీవిశ్వ రచించిన ఈ గీతాన్ని హేమచంద్ర ఆలపించారు. శక్తికాంత్‌ కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు.

https://youtu.be/8Q9zxLEuulE
Exit mobile version