NTV Telugu Site icon

Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ కూడా వచ్చేస్తున్నాడు

Alanatiramacjandhrudu

Alanatiramacjandhrudu

Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ అనగానే మన తెలుగు వాళ్ళకి అందరికి గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ చేసిన మురారి సినిమా లో ఎంతో పెద్ద హిట్ అయిన సాంగ్ ఇక అదే సాంగ్ రిఫరెన్స్ తో యంగ్ నటుడు కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ సరసన హీరోయిన్ గా మోక్ష నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Also Read: Nani: సరిపోదా శనివారం పోస్టర్స్ డే కాన్సెప్ట్ అదిరింది..మీరు ఓ లుక్కేయండి..

ఇక కథ విషయానికి వస్తే.. ‘ఇది ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించే నిజాయితీ గల యువకుడి కథ. తను ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. తన ఫ్రెండ్స్, చుట్టుపక్కలవారు అందరూ కూడా తన ప్రేమను అమ్మాయికి చెప్పమని బలవంతం చేస్తారు. కానీ ఆమె నో చెబితే ఏమౌతుందో చెప్పడానికి భయపడతాడు. అయితే వీరి మధ్య కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి’ చివరికి అబ్బాయి లవ్ అమ్మాయికి తెలిసిందా..? వీరిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? అనేది స్టోరీ. కథలోని డ్రామా, ఎమోషనల్ సీన్స్ ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ఆగస్టు 2న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ మరింత అంచనాలను పెంచేసింది. బ్రహ్మాజీ, వెంకటేశ్‌ కాకుమాను, సుధ, ప్రమోదిని, చైతన్య గరికపాటి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌సాగర్‌, సంగీతం: శశాంక్‌.టి, సహ నిర్మాత: కె.జగదీశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.

Show comments