Site icon NTV Telugu

Al Pacino: ప్రేయసి కడుపులో బిడ్డకు డీఎన్ఎ టెస్ట్ చేయించిన 83 ఏళ్ళ నటుడు.. సిగ్గుండాలి

Al Pasino

Al Pasino

Al Pacino: సాధారణంగా పెళ్లి, పిల్లలు అనేది వారి పర్సనల్స్. కానీ, సినీ తారల విషయంలో మాత్రం అభిమానులు ఎప్పుడు వారి జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటారు. అది అనుమానం కాదు అభిమానం. మా హీరో అది.. మా హీరో ఇది అని చెప్పుకోవాలి అంటే.. వారు తప్పు చేయకుండా అభిమానులే ఆపాలి. అయితే ఇదంతా మన దేశం వరకే.. హాలీవుడ్ నటులు ఇలాంటివాటి గురించి అస్సలు పట్టించుకోరు. ఏ వయస్సులోనైనా పెళ్లి చేసుకుంటారు.. పిల్లల్ని కంటారు. ఎంతమందిని అయినా పెళ్లి చేసుకుంటారు. అయితే 83 ఏళ్ళ వయస్సులో తండ్రి కాబోతున్నాడు ఒక నటుడు. ఇక్కడవరకు ఓకే కానీ, ఆ బిడ్డకు తండ్రి తాను అవునో కాదో అని డీఎన్ఎ టెస్ట్ చేయించాడు. ప్రస్తుతం ఆ ఘనుడు గురించిన ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎవరా నటుడు అని అంటే .. ఫేమస్ హాలీవుడ్ నటుడు అల్ పాసినో.

Guntur Kaaram: ఈ కారం ఘాటు హాలీవుడ్ వరకూ చేరింది… రీజనల్ సినిమాకి కింగ్

గాడ్ ఫాదర్ లాంటి క్లాసిక్ మూవీలో నటించి మెప్పించిన అల్ పాసినో 83 ఏళ్ళ వయస్సులో తనకంటే వయస్సులో చిన్నది అయిన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్యనే ఆమె ప్రెగ్నెంట్ అయ్యినట్లు తెల్సింది. ఇక ఆ విషయం తెల్సిన వెంటనే ఎవరైనా ఏం చేస్తారు.. ఎగిరి గంతేస్తారు. లేక అందరికి స్వీట్స్ పంచుతారు. కానీ, మనోడు మాత్రం ఆ బిడ్డకు తండ్రి తానో కాదో తెలియడానికి డీఎన్ఎ టెస్ట్ చేయించాడు. చివరకు ఆ డీఎన్ఎ టెస్ట్ లో బిడ్డకు ట్యాంఫ్రి తానే అని తెలిసాకా హిప్ హిప్ హుర్రే అంటూ డ్యాన్స్ లు వేశాడు. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ అతడిని ఏకిపారేస్తున్నారు. సిగ్గుండాలి.. అంత నమ్మకం లేనప్పుడు ఆమెతో సహజీవనం ఎలా చేసావ్ అని కొందరు. ఈ వయస్సులో నువ్వు చేసిందే పెద్ద తప్పు.. మళ్లీ దానికి తోడు ఇలాంటి పనులా.. ఛీఛీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version