Site icon NTV Telugu

Akshay Kumar: మహర్షి వాల్మీకి ట్రైలర్ వీడియోలు నకిలీ..

Akshai Kumar

Akshai Kumar

ఈ AI వచ్చిన కానుంచి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం అయింది. హీరోయిన్ హీరోల మీద రకరకాల వీడియోలు రోజుకొకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో సెలబ్రెటీలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ చేశారు. దీంతో తన పై వైరల్ అవుతున్న వీడియోల పై స్పష్టత ఇచ్చారు అక్షయ్.

Also Read : Katrina Kaif – vicky kaushal: బేబీ బంప్‌ ఫొటోతో.. గుడ్‌న్యూస్‌ చెప్పిన బాలీవుడ్ స్టార్ కపుల్

“ఇటీవల నేను ‘మహర్షి వాల్మీకి’ పాత్రలో నటిస్తున్నట్లు చూపించే సినిమా ట్రైలర్ వీడియోలు చూశాను. ఆ వీడియోలు మూడు రకంగా AI ఉపయోగించి సృష్టించబడిన నకిలీ కంటెంట్. నిజానికి, ఇది అసలు సినిమా ట్రైలర్ కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని న్యూస్ ఛానెల్స్ కూడా దీన్ని గురించి నిజానిజాలు తెలుసుకోకుండా ‘వార్త’ గా చూపిస్తున్నాయి. AI ద్వారా త్వరగా తయారయ్యే ఫేక్ కంటెంట్ నేటి రోజుల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే, వార్తలను ధృవీకరించిన తర్వాత ప్రచురించాలి. బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ చాలా అవసరం” అని హృదయపూర్వకంగా కోరారు. ఫ్యాన్స్‌కి స్పష్టంగా “అలాంటి వీడియోలను నిజంగా తీసుకోకండి, ఫేక్ కంటెంట్‌పై విని గందరగోళం చెందకండి” అంటూ తెలిపారు.

 

Exit mobile version