Akshay Kumar: షూటింగ్‌లో అపశృతి.. అక్షయ్ కుమార్‌కి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshay Kumar Injured In Bade Miyan Chote Miyan Shooting: సాధారణంగా కథానాయకులు డేంజరస్ స్టంట్స్‌లో నటించరు. ఏదైనా ప్రమాదం సంభవించొచ్చన్న భయంతో.. డూప్స్‌తో ఆయా స్టంట్స్ చేయిస్తారు. అయితే.. ఈమధ్యకాలంలో సహజత్వం లోపించకుండా ఉండేందుకు స్వయంగా హీరోలే రంగంలోకి దిగుతున్నారు. ఎలాంటి స్టంట్స్ చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఇక బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అయితే.. ఇలాంటి యాక్షన్ సీన్స్‌లో నటించడానికి ఎప్పుడూ ముందుంటాడు. అఫ్‌కోర్స్.. అతడు స్టంట్స్ చేయడంలో దిట్ట. తాను స్టంట్స్ చేసే హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు. ఇప్పటికీ.. ఛాలెంజింగ్‌గా తీసుకొని, డేంజరస్ స్టంట్స్ చేస్తూనే ఉంటాడు.
WPL 2023 : శివాలెత్తిన సీవర్.. వాంగ్ హోరు.. ముంబై చేతిలో చిత్తుగా ఓడిన యూపీ
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇప్పుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటిస్తున్న బడే మియా ఛోటే మియా సినిమాలోనూ తానే స్వయంగా యాక్షన్ స్టంట్స్‌లలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు తాజాగా గాయాలపాలయ్యాడని సమాచారం. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం స్కాట్‌లాండ్‌లో జరుగుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు.. అక్షక్ కాలికి గాయాలయ్యాయి. అయితే.. ఇది తీవ్రమైన గాయం కాదని, దాంతో అతడు ఆ గాయంతోనే షూటింగ్ కొనసాగించాడని యూనిట్ సభ్యులు వెల్లడించారు. టైగర్‌తో కలిసి ఓ యాక్షన్ స్టంట్ షూట్ చేస్తున్న సమయంలో ఈ అపశృతి చోటు చేసుకున్నట్టు తెలిసింది. షూటింగ్ ముగిసిన అనంతరం అతనికి చికిత్స అందించారు. ఆ గాయం నుంచి కోలుకునే దాకా.. ఎలాంటి యాక్షన్ సీన్స్ చిత్రీకరించకూడదని యూనిట్ నిర్ణయించింది.
Parrot : యజమానిని చంపిన వాళ్లను పట్టించిన చిలుక.. తొమ్మిదేళ్ల తర్వాత ఇద్దరికి జీవిత ఖైదు
అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘పూజా ఎంటర్టైనర్‌మెంట్’, ఆజ్ (AAZ) బ్యానర్‌లపై వషు భగ్నాని సమర్పిస్తుండగా.. దీప్షికా దేశ్‌ముఖ్, జాకీ భగ్నాని, హిమాన్షు కిషన్ మెహ్రా, అలీ అబ్బాస్ జఫర్ నిర్మిస్తున్నారు. ఇందులో సొనాక్షీ సిన్హా, జాన్వీ కపూర్, అలయా ఎఫ్, మానుషీ ఛిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!