Site icon NTV Telugu

Akshay Kumar: షూటింగ్‌లో అపశృతి.. అక్షయ్ కుమార్‌కి గాయాలు

Akshay Kumar Injured

Akshay Kumar Injured

Akshay Kumar Injured In Bade Miyan Chote Miyan Shooting: సాధారణంగా కథానాయకులు డేంజరస్ స్టంట్స్‌లో నటించరు. ఏదైనా ప్రమాదం సంభవించొచ్చన్న భయంతో.. డూప్స్‌తో ఆయా స్టంట్స్ చేయిస్తారు. అయితే.. ఈమధ్యకాలంలో సహజత్వం లోపించకుండా ఉండేందుకు స్వయంగా హీరోలే రంగంలోకి దిగుతున్నారు. ఎలాంటి స్టంట్స్ చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఇక బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అయితే.. ఇలాంటి యాక్షన్ సీన్స్‌లో నటించడానికి ఎప్పుడూ ముందుంటాడు. అఫ్‌కోర్స్.. అతడు స్టంట్స్ చేయడంలో దిట్ట. తాను స్టంట్స్ చేసే హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు. ఇప్పటికీ.. ఛాలెంజింగ్‌గా తీసుకొని, డేంజరస్ స్టంట్స్ చేస్తూనే ఉంటాడు.

WPL 2023 : శివాలెత్తిన సీవర్.. వాంగ్ హోరు.. ముంబై చేతిలో చిత్తుగా ఓడిన యూపీ

ఇప్పుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటిస్తున్న బడే మియా ఛోటే మియా సినిమాలోనూ తానే స్వయంగా యాక్షన్ స్టంట్స్‌లలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు తాజాగా గాయాలపాలయ్యాడని సమాచారం. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం స్కాట్‌లాండ్‌లో జరుగుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు.. అక్షక్ కాలికి గాయాలయ్యాయి. అయితే.. ఇది తీవ్రమైన గాయం కాదని, దాంతో అతడు ఆ గాయంతోనే షూటింగ్ కొనసాగించాడని యూనిట్ సభ్యులు వెల్లడించారు. టైగర్‌తో కలిసి ఓ యాక్షన్ స్టంట్ షూట్ చేస్తున్న సమయంలో ఈ అపశృతి చోటు చేసుకున్నట్టు తెలిసింది. షూటింగ్ ముగిసిన అనంతరం అతనికి చికిత్స అందించారు. ఆ గాయం నుంచి కోలుకునే దాకా.. ఎలాంటి యాక్షన్ సీన్స్ చిత్రీకరించకూడదని యూనిట్ నిర్ణయించింది.

Parrot : యజమానిని చంపిన వాళ్లను పట్టించిన చిలుక.. తొమ్మిదేళ్ల తర్వాత ఇద్దరికి జీవిత ఖైదు

అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘పూజా ఎంటర్టైనర్‌మెంట్’, ఆజ్ (AAZ) బ్యానర్‌లపై వషు భగ్నాని సమర్పిస్తుండగా.. దీప్షికా దేశ్‌ముఖ్, జాకీ భగ్నాని, హిమాన్షు కిషన్ మెహ్రా, అలీ అబ్బాస్ జఫర్ నిర్మిస్తున్నారు. ఇందులో సొనాక్షీ సిన్హా, జాన్వీ కపూర్, అలయా ఎఫ్, మానుషీ ఛిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version