Akshay Kumar Birthday Special : ‘రామ్ సేతు’పైనే అక్షయ్ కుమార్ ఆశలు!
ఒకానొక సమయంలో భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగానూ, అత్యధికంగా పన్ను చెల్లించిన నటునిగానూ అక్షయ్ కుమార్ రికార్డ్ సృష్టించారు. ఖాన్ త్రయంగా పేరొందిన ఆమిర్, సల్మాన్, షారుఖ్ దాటికి తట్టుకొని నిలచిన ఘనుడు అక్షయ్ కుమార్. వరుస విజయాలు చూస్తూ సాగిన అక్షయ్ కుమార్ సైతం ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఖాన్ త్రయం సాధించిన స్థాయిలో బ్లాక్ బస్టర్స్ చూడక పోయినా, అక్షయ్ కుమార్ సైతం అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ ముగ్గురూ ఇప్పటి దాకా జాతీయ స్థాయిలో ఉత్తమ నటులుగా అవార్డులు అందుకోలేదు. కానీ, అక్షయ్ కుమార్ 2016లో తాను హీరోగా నటించిన ‘రుస్తుమ్’ చిత్రం ద్వారా ఉత్తమ నటునిగా నేషనల్ అవార్డు సంపాదించారు.
అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓమ్ భాటియా. 1967 సెప్టెంబర్ 9న పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించారు. ఆయన తండ్రి హరి ఓమ్ భాటియా మిలిటరీ ఆఫీసర్. దాంతో అక్షయ్ కూడా చిన్నతనం నుంచీ ఎంతో క్రమశిక్షణతో పెరిగారు. అక్షయ్ కి మొదటి నుంచీ స్పోర్ట్స్ అంటే ప్రాణం. ముంబైలోని మాతుంగలో ఉన్న డాన్ బాస్కో హై స్కూల్ లో అక్షయ్ చదివారు. తరువాత గురునానక్ ఖల్సా కాలేజ్ లో చేరారు. కానీ, చదువుపై అంతగా ఆసక్తి లేని అక్షయ్ తన తండ్రిని ఒప్పించి హాంగ్ కాంగ్ కు వెళ్ళి మార్షియల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించారు. తరువాత ఏం చేయాలనుకుంటున్నావని తండ్రి అడగ్గానే తాను యాక్టర్ ను అవుతానని సమాధానమిచ్చారు అక్షయ్. ముంబైలోనే ఓ మార్షియల్ స్కూల్ పెట్టి అక్కడ పలువురికి కరాటే, జూడో నేర్పించసాగారు అక్షయ్. అలా అక్షయ్ దగ్గర మార్షియల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ఓ అబ్బాయి తండ్రి అక్షయ్ ను చూసి మోడల్ గా ఎన్నుకున్నారు. తాను నెలంతా కష్టపడితే వచ్చే మొత్తం కేవలం రెండు రోజుల్లోనే లభించడంతో అక్షయ్ కి కూడా నటనలో రాణించాలన్న తపన పెరిగింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జయేష్ సేథ్ తో ఫోటో షూట్ చేయించుకోవాలని ఆశించారు అక్షయ్. అయితే ఆయన డిమాండ్ చేసిన డబ్బు అక్షయ్ వద్ద లేకపోవడంతో 18 నెలలు పైసా తీసుకోకుండా జయేష్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ పై ఆ ఫోటో ఆల్బమ్ పట్టుకొని బాలీవుడ్ లో నటునిగా వేట ఆరంభించారు అక్షయ్. కొన్ని సినిమాల్లో గ్రూప్ డాన్సర్ గానూ చిందులేశారు. తొలుత ‘దీదార్’ అనే సినిమాలో కీ రోల్ కు సైన్ చేశారు అక్షయ్. కానీ, ‘సౌగంధ్’లో అవకాశం వచ్చింది. ఆ సినిమాయే ముందుగా విడుదలయింది. అబ్బాస్ ముస్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖిలాడి’ చిత్రం విజయం సాధించడంతో అక్షయ్ కుమార్ కు మంచి పేరు లభించింది. అప్పటి నుంచీ అవకాశాలు ఆయన తలుపు తడుతూ వచ్చాయి. విజయాలూ పలకరించాయి. మరి వెను తిరిగి చూసుకోలేదు.
Also Read
- దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
- Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ఆ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా కూతురు ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ పెళ్ళాడారు. వారికి ఇద్దరు పిల్లలు. ట్వింకిల్ అడుగు పెట్టాక అక్షయ్ స్టార్ డమ్ మరింతగా పెరిగింది. అక్షయ్ కుమార్ – కత్రినా కైఫ్ జోడీ పలు చిత్రాలలో అలరించింది. అక్షయ్ కొన్ని సౌత్ మూవీస్ లోనూ నటించారు. రజనీకాంత్ హీరోగా రూపొందిన శంకర్ చిత్రం ‘రోబో 2.0’లో అక్షయ్ కుమార్ విలక్షణమైన పాత్రలో అలరించారు. నిర్మాతగానూ అక్షయ్ సాగారు. అక్షయ్ కుమార్ కు తొలినుంచీ హిందుత్వ అంటే అభిమానం. దాంతో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపారు. అందువల్లే అక్షయ్ కుమార్ సినిమాలు బాగా ఆడేలా చేశారని, ఆయనకు నేషనల్ అవార్డూ ఇచ్చారని కొందరు అంటూఉంటారు. కానీ, అక్షయ్ అంతకు ముందు సాధించిన ఘనవిజయాలకు ఎవరి అండా లేదు కదా! అలాగే ఆయనకు ప్రభుత్వం అండ ఉంటే, ఏదైనా వ్యక్తిగతంగా మేలు జరుగుతుందే తప్ప, అక్షయ్ సినిమాలు ఆడించలేరు కదా!
ఈ యేడాది అక్షయ్ కుమార్ నటించిన “బచ్చన్ పాండే, సమ్రాట్ పృథ్వీరాజ్, రక్షాబంధన్” చిత్రాలు ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి. ఓ వారం క్రితం అక్షయ్ నటించిన ‘కట్ పుత్లీ’ నేరుగా ఓటీటీలో విడుదలయింది. ఈ సినిమా తమిళ చిత్రం ‘రాచ్చసన్’ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం సైతం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందనే తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఆశలన్నీ తాను నటించిన ‘రామ్ సేతు’పైనే ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 21న జనం ముందుకు రానుంది. రాబోయే ‘రామ్ సేతు’తో అయినా అక్షయ్ కుమార్ మళ్ళీ జనాన్ని ఆకట్టుకుంటారేమో చూడాలి.
తాజావార్తలు
-
దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!