Site icon NTV Telugu

Mahakali : మహాకాళి నుండి అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్ లుక్ రివీల్

Mahankali Akshaikanna Post

Mahankali Akshaikanna Post

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ‘జై హనుమాన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్నాడు. ఇందులో మహాకాళి మూవీని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. దీనికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా.. పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్‌ని.. సెప్టెంబర్ 30న ఉదయం 10:08 గంటలకు రివీల్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. కాగా చెప్పినట్లుగానే మూవీ నుంచి మేకర్స్ అక్షయ్ ఖన్నా పవర్ ఫుల్ లుక్ రిలీజ్ చేశారు.

Also Read : Megha#158 : మెగాస్టార్ 158 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్? టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

ముందు నుంచి కూడా ఈ మూవీలో అక్షయ్ ఖన్నా కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇవ్వాల రిలీజ్ అయిన లుక్ తో కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ లుక్ లో అక్షయ్ చాలా డిఫరెంట్ గా భయంకరంగా ఉన్నారు. మరి ఇంతకీ అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలో కనిపిస్తారా? మరేదైనా కీలక పాత్ర పోషిస్తారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో హీరోగా చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో చాన్నాళ్లు నటించలేదు. ఛావా మూవీలో ఔరంగజేబుగా అదరగొట్టడంతో ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు మహాకాళి లాంటి ప్రాజెక్ట్ లో కూడా భాగం అయ్యారు.

 

Exit mobile version