NTV Telugu Site icon

Akkineni Venkat: ఆస్తి పంపకాలు.. నాగార్జునతో గొడవలు.. అన్న వెంకట్ ఏమన్నాడంటే..?

Nag

Nag

Akkineni Venkat: అక్కినేని కుటుంబం గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరావుకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అక్కినేని వెంకట్ కాగా.. రెండో కొడుకు అక్కినేని నాగార్జున. ఇక ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇండస్ట్రీలోనే ఎదిగారు. అయితే నాగ్.. హీరోగా మారడంతో అందరికి పరిచయం. వెంకట్ నిర్మాతగా ఉండడంతో చాలామందికి తెలియకపోవచ్చు. కుటుంబం అన్నాకా గొడవలు ఉండడం సహజం. కానీ, వాటిని బయటికి తీసుకురాకుండా కాపాడేవాడే కాపాడేవాడే ఇంటిపెద్ద. ఇక నాగేశ్వరరావు ఉన్నప్పుడు అంతా మంచిగానే ఉండేది. ఆయన చనిపోయాకా.. అక్కినేని కుటుంబంలో విబేధాలు అంటూ వార్తలు వచ్చాయి. ఆస్తి పంపకాల్లో పొరపచ్చాలు వచ్చాయని, అన్నపూర్ణ స్టూడియోస్.. నాగ్ చేతిలో నుంచి జారిపోయిందని, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవల వలన మాటలు లేవని.. ఇలా చాలా రకాలుగా రూమర్స్ వచ్చాయి. ఈ విషయాలపై నాగ్ ఏరోజు స్పందించింది లేదు.

Mrunal Thakur: సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో..

తాజాగా అక్కినేని వెంకట్ ఈ రూమర్స్ అన్నింటికీ క్లారిటీ ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ” నాన్నగారు.. మా ఇద్దరినీ కూడా సినిమాలకు దూరంగానే పెంచారు. మేము సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెరిగాం. ఒకరోజు..నేనే నాన్న దగ్గరకు వెళ్లి భయం భయంగా చెప్పాను. నాన్న.. నాగ్ ను హీరోను చేద్దాం.. నేను నిర్మాతగా మారతాను అని.. వెంటనే ఆయన ఓకే అనేసరికి షాక్ అయ్యాను. అలా నాగ్ హీరోగా, నేను నిర్మాతగా మారాము. ఆ తరువాత చాలాకాలం నిర్మాతగా ఉన్నాను. ఇక జనరేషన్ గ్యాప్ వస్తుందని.. నేనే సినిమాలు ఆపేశాను. ఇక ఆస్తి పంపకాలు, నాగ్ తో గొడవలు ఇలాంటివి అన్ని అబద్దాలు. అందులో నిజం లేదు. ప్రస్తుతం ఈ స్టూడియోస్ వ్యవహారాలను నాగార్జుననే చూసుకుంటున్నాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments