Site icon NTV Telugu

Dhanush 51: పాన్ ఇండియా సినిమాలో కింగ్ నాగ్ స్పెషల్ రోల్…

Dhanush

Dhanush

ఒకపక్క మన్మథుడు రీరిలీజ్ తో… మరో వైపు నా సామీ రంగ ప్రోమోతో… అక్కినేని అభిమానులంతా నాగార్జున బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ జోష్ ని మరింత పెంచుతూ నాగార్జున నటిస్తున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. టాలెంటెడ్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. D51 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ధనుష్ బర్త్ రోజున ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్… ఇది సోషల్ కాజ్ ని టచ్ చేసే ప్రాజెక్ట్ అనే హింట్ ఇచ్చారు. 

ధనుష్ ప్రస్తుతం తన 50వ సినిమాని డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే శేఖర్ కమ్ముల సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనుంది. ఈ ప్రాజెక్ట్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం కింగ్ నాగ్ ని మేకర్స్ అప్రోచ్ అవ్వగా… నాగార్జున ఓకే చెప్పడం జరిగింది. దీంతో నాగార్జున బర్త్ డే రోజున ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ… D51లో నాగార్జున నటిస్తున్నాడు అనే అనౌన్స్మెంట్ ని ఇచ్చారు మేకర్స్. ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా క్యామియో ప్లే చేసిన నాగార్జున, ఇప్పుడు ధనుష్ ప్రాజెక్ట్ లో నటిస్తుండడం విశేషం. క్యారెక్టర్ నచ్చితే క్యామియో ప్లే చేయడానికి వెనకాడకుండా ముందుకి వెళ్తున్న నాగార్జున, ధనుష్ సినిమాలో ఎలాంటి రోల్ ప్లే చేసాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version