Akkineni Nagarjuna: నా సామి రంగ హిట్.. అంతా మీవల్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ నా సామి రంగ. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని ‘సంక్రాంతి కింగ్’ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది.
ఇక ఈ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. ” అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. చాలా ఆనందంగా వున్న నా అభిమానులందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు, అభిమానుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన, వారి అనందం చూస్తుంటే నాకు చాలా అనందంగా, తృప్తిగా వుంది. మా యూనిట్ లో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ ప్రేమతో, సంక్రాంతికి విడుదలవ్వాలి, పెద్ద విజయం సాధించాలనే సంకల్పంతో పని చేశారు. ఇప్పుడు ఫలితం కూడా అంత గొప్పగా వచ్చింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్టార్ కీరవాణి గారని మొదటి నుంచి చెబుతున్నాను. ఇప్పుడు అదే మాట చెబుతున్నా. అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ చాలా హార్డ్ వర్క్ చేశారు. రోజుకి కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. మిగతా సమయం అంతా ఈ ప్రాజెక్ట్ పైనే ఉండేవారు. ఇది హ్యుజ్ మూవీ. చాలా పాత్రలు వున్నాయి. ఇంతమందిని, ఇన్ని పాత్రలని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. తనకి చాలా గొప్ప భవిష్యత్ వుంటుంది. డివోపీ శివేంద్ర హనుమాన్ చేశాడు. అందులో తన వర్క్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. మా సినిమాలో కూడా చాలా చక్కటి వర్క్ చేశాడు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక సంక్రాంతి అంటే శివేంద్రనే కెమరామ్యాన్ తీసుకుంటారేమో. ఇప్పుడు తను సంక్రాంతి అల్లుడు(నవ్వుతూ). నిర్మాత చిట్టూరి గారు ఈ కథ వినగానే సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్లే అయ్యింది. ఆయన గొప్ప ప్రోత్సాహం అందించారు. అలాగే పవన్ గారు కూడా. అలాగే టెక్నిషియన్స్ అంతా చాలా కలసికట్టుగా పని చేశారు. నరేష్ తో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. తన చేసిన సీన్స్, డ్యాన్సులు, యాక్షన్ అద్భుతంగా వున్నాయి. సెకండ్ హాఫ్ లో తను ఎమోషన్ పండించకపోతే క్లైమాక్స్ పండేది కాదు. రాజ్ తరుణ్ కూడా చక్కని నటన కనబరిచాడు. మిర్నా, రుక్సర్, షబ్బీర్, రావు రమేష్ గారు, నాజర్ గారు అందరూ చక్కని పాత్రలలో ఒదిగిపోయారు. ఆషికా కి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. అలాంటి పాత్ర చేయడం అంత సులువు కాదు. తన పాత్రలోని రెండు లేయర్స్ ని చాలా అద్భుతంగా చేసింది. తనకి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుందని భావిస్తున్నాను. మీడియా మిత్రులు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!