ఈ సినిమాలో నేనూ ఉన్నా రాజమౌళి గారు… : నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ హిందీ పోస్టర్‌ను విడుదల చేసిన తర్వాత ఈరోజు తెలుగు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం పోస్టర్లను కూడా లాంచ్ చేశారు. అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు పోస్టర్ లాంచ్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.కింగ్ నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ సినిమాలో కీలక పాత్రను తనను తీసుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తన గురించి కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ కు థ్యాంక్స్ చెబుతూ, ఆయన తల్లిదండ్రులతో గడిపిన క్షణాలను నెమరేసుకున్నారు. ఈ సినిమా రాజమౌళి గారు చెప్పినట్టుగా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని అన్నారు. ఈ మూవీ ఎపిక్ మూవీ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఏడేళ్లు ఈ సినిమాను చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు.
Read also : వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై రాజమౌళి కామెంట్స్
Also Read
- The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
- The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
- Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
- Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
ఇక పక్కనే ఉన్న రాజమౌళికి థాంక్స్ చెబుతూ “నేను కూడా ఈ సినిమాలో భాగమయ్యాను రాజమౌళి గారు. అందుకే మీకు చిత్రబృందం తరపున కృతజ్ఞతలు చెబుతున్నాను” అని అన్నారు. రాజమౌళి సినిమాకు భాషలు అడ్డు కాదని నిరూపించారు. రాజమౌళి మరోసారి “ఆర్ఆర్ఆర్”తో అదే విషయాన్నీ చెప్పబోతున్నారు. ఇది మరో నేషనల్ ఫిల్మ్ అవుతుంది అంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!