Site icon NTV Telugu

ఈ సినిమాలో నేనూ ఉన్నా రాజమౌళి గారు… : నాగార్జున

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ హిందీ పోస్టర్‌ను విడుదల చేసిన తర్వాత ఈరోజు తెలుగు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం పోస్టర్‌లను కూడా లాంచ్ చేశారు. అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు పోస్టర్ లాంచ్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.కింగ్ నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ సినిమాలో కీలక పాత్రను తనను తీసుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తన గురించి కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ కు థ్యాంక్స్ చెబుతూ, ఆయన తల్లిదండ్రులతో గడిపిన క్షణాలను నెమరేసుకున్నారు. ఈ సినిమా రాజమౌళి గారు చెప్పినట్టుగా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని అన్నారు. ఈ మూవీ ఎపిక్ మూవీ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఏడేళ్లు ఈ సినిమాను చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు.

Read also : వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై రాజమౌళి కామెంట్స్

ఇక పక్కనే ఉన్న రాజమౌళికి థాంక్స్ చెబుతూ “నేను కూడా ఈ సినిమాలో భాగమయ్యాను రాజమౌళి గారు. అందుకే మీకు చిత్రబృందం తరపున కృతజ్ఞతలు చెబుతున్నాను” అని అన్నారు. రాజమౌళి సినిమాకు భాషలు అడ్డు కాదని నిరూపించారు. రాజమౌళి మరోసారి “ఆర్ఆర్ఆర్”తో అదే విషయాన్నీ చెప్పబోతున్నారు. ఇది మరో నేషనల్ ఫిల్మ్ అవుతుంది అంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

Exit mobile version