NTV Telugu Site icon

Akkineni Nagarjuna: ఒక్క షర్ట్ రూ. 2 లక్షలా.. కింగ్ అనిపించుకున్నావ్ కదయ్యా

Nag

Nag

Akkineni Nagarjuna:అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నాగ్ ఓ పక్క సినిమాలు ఇంకోపక్క బిగ్ బాస్ అంటూ బిజీగా మారాడు. నా సామీ రంగా అనే సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక నాగ్ సినిమాల గురించి పక్కన పెడితే బిగ్ బాస్ కు మకుటం లేని మహారాజుగా మారిపోయాడు ఈ మన్మథుడు. దాదాపు 5 సీజన్లుగా నాగే బిగ్ బాస్ ను నడిపిస్తున్నాడు. ఇక ఈ సీజన్ లో నాగ్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నాడు. గత ఆరు సీజన్లో లేనంతగా ఈ సీజన్ చాలా ఆసక్తి క్రియేట్ చేస్తుంది. ఇక ప్రతివారం కూడా నాగ్ హౌస్ లోని కంటెస్టెంట్స్ తో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే సీజన్ మొదలైన దగ్గర నుంచి అందరూ చూపు నాగార్జున డ్రెస్సింగ్ స్టైల్ మీదే ఉంది అంటే అతిశయోక్తి కాదు. మొదటి నుంచి కూడా నాగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు.

Anand- Vaishnavi Chaitanya: హ్యాండిచ్చినా వైష్ణవి వెంటే పడుతున్న ఆనంద్ దేవరకొండ

ఇక గత రాత్రి నాగార్జున వేసుకున్న షర్టు గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. డిఫరెంట్ కలర్స్ తో ప్రింటెడ్ షర్ట్ వేసుకొని కనిపించాడు. ఈ షర్ట్ చూడగానే కుర్రకారు ఈ షర్ట్ ఏదో బాగుంది కదా అని దాని ధర ఎంతో తెలుసుకోవడానికి గూగుల్ చేసి అవాక్కయ్యారు. సాధారణంగా ఒక షర్ట్ మహా అయితే పదివేలు ఉంటుందేమో.. అంతకన్నా ఎక్కువే ఉంటుంది .. కానీ నాకు ధరించిన ఈ షర్టు విలువ దాదాపు రెండు లక్షలు అని తెలుస్తుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినా లూయిస్ వ్యూటన్ బ్రాండ్ కు చెందిన లగ్జరీ షర్ట్ కావడంతో అంత రేటు అని సమాచారం. ఇక ఆ రేటు చూశాక అభిమానులు నాగార్జునపై తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. షర్టుకు ఎందుకంత ధర అని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం కింగ్ అనిపించుకున్నావు అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ షర్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments