అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం కోడళ్ల వేటలో పడిందా.. ? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అక్కినేని ఫ్యామిలిలో మొదటి పెళ్లి అచ్చి రాలేదని అందరికి తెల్సిన విషయమే.. అక్కినేని వారసులు నాగ చైతన్య విడాకుల.. అఖిల్ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడం.. ఇలా మొదటి పెళ్లి ఈ వారసులకు సెట్ కాలేదని తెలుస్తోంది. ఇక ఇద్దరు వారసుల బాధ్యతను నెత్తిమీద వేసుకున్న నాగ్.. ఇద్దరి కెరీర్ ని ఒక గాడిన పడేశాడు. చైతూ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నాడు. అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో హిట్ అందుకొని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. కెరీర్ విషయంలో వారసులను సెట్ చేసిన నాగ్ వారి పర్సనల్ జీవితాలను కూడా సెట్ చేసే పనిలో పడ్డాడట.
చైతూ విడాకుల తరువాత కెరీర్ లో బిజీగా మారాడు. అతడిని ఇప్పట్లో కదిలించే పనే లేదు. దీంతో నాగ్ ఫోకస్ అంతా అయ్యగారి మీదనే పెట్టాడట. త్వరలోనే అఖిల్ కి పెళ్లి చేయాలనే ప్లాన్స్ లో ఉన్నారట అక్కినేని ఫ్యామిలీ. అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు. సామ్ – చై విడాకుల తరువాత నాగ్ ఎక్కడికి వెళ్లినా కొడుకుల పెళ్లి గురించే మాట్లాడుతుండడంతో అయన మనసులో మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక కొడుకులను పెళ్లి చేసి ఒక దారిన పెడితే కాస్త కుదుటపడొచ్చని నాగ్ అనుకుంటున్నాడట. ఇప్పటికే అఖిల్ బాబు కోసం అమ్మాయిని వెతికే పనిలో పడ్డారట. అన్ని కుదిరితే అయ్యగారు వచ్చే ఏడాది పెళ్లి కొడుకుగా దర్శనమిచ్చినట్లే.. మరి అక్కినేని ఇంట అడుగుపెట్టే కొత్తకోడలు.. చిన్న కోడలు ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.