Akkineni Nagarjuna: అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన లెగెసీని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున ముందుకు నడిపిస్తున్నాడు. అక్కినేని కుటుంబంలో నాగార్జున మాత్రమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రితో నాగ్ కు ఎన్నో జ్ఞాపకాలు అని చెప్పొచ్చు. ఇక నాగ్ మొదట వెంకటేష్ చెల్లిని వివాహమాడాడు. వారికి పుట్టిన కొడుకే నాగ చైతన్య. ఇక ఆమెతో విడాకులు అయ్యాకా.. హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి పుట్టిన కొడుకే అఖిల్. చిన్నతనం నుంచి చై.. అక్కినేని ఇంట కన్నా దగ్గుబాటి ఇంట్లోనే ఎక్కువ పెరిగాడన్న విషయం అందరికి తెల్సిందే. రెండు కుటుంబాల మధ్య పెరిగాడు చై. అమల కుల చై ను తన పెద్ద కొడుకుగానే చూసుకుంది.
తాజాగా అక్కినేని కుటుంబం రేర్ పిక్ ఒకటి బయటకొచ్చింది. ఇందులో అక్కినేని నాగేశ్వరావు, అన్నపూర్ణమ్మ దంపతులతో పాటు నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. అమల పక్కన అఖిల్, చైతన్య ఉన్నారు. అఖిల్ వయస్సు మూడేళ్లు ఉన్నట్లు ఉండగా .. చై ఆరేళ్ళులా కనిపిస్తున్నాడు. అయితే.. ఈ ఫొటోలో అందరి ముఖంలో నవ్వు ఉంది కానీ, చైతన్య ముఖం మాత్రం చాలా బాధగా ఉన్నట్లు ఉంది. ఇక ఈ ఫోటో చూసినవారందరూ.. చై ఎందుకు అలా ఉన్నాడు.. ? అని ప్రశ్నిస్తుండగా.. ఇంకొందరు మాత్రం తమకు తోచిన సమాధానాలు చెప్పుకొస్తున్నారు. చై.. తల్లి లేదుగా అందుకే అలా ఉన్నాడని కొందరు.. ఫోటో తరువాత స్కూల్ కి వెళ్ళాలి అని చెప్పినట్టున్నారని కొందరు.. చాక్లెట్స్ ఇవ్వనని చెప్పరేమో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.