కింగ్ నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి నటించడం అనేది మనం సినిమాతో మొదలైంది. ఆతర్వాత
చేసిన సినిమాలలో చైతుతోనే నాగ్ కనిపించాడు. ఇటీవల బంగార్రాజు చిత్రంలో నాగ్, చైతూల స్క్రీన్ ప్రజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక దీంతో ఫ్యాన్స్ అఖిల్ తో కూడా ఒక మల్టీస్టారర్ చేయమని నాగ్ ని అడుగుతున్నారట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే నాగ్, అఖిల్ మల్టీస్టారర్ రానున్నదట. ఇటీవల మలయాళంలో హిట్ అయిన బ్రో డాడీ సినిమాను తెలుగులో ఈ తండ్రికొడుకులిద్దరు రీమేక్ చేయనున్నారని సమాచారం.
మలయాళంలో మోహన్ లాల్, పృథ్వి రాజ్ సుకుమారన్ నటించిన పాత్రల్లో నాగార్జున, అఖిల్ కనిపించనున్నారట. ఇప్పటికే రీమేక్ హక్కులను కూడా నాగ్ దక్కించుకున్నారని టాక్. ఇక గాడ్ ఫాదర్ తో బిజీగా ఉన్న మోహన్ రాజా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. యూనివర్శల్ సబ్జెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందట. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ తండ్రికొడుకులకు కలిసి వస్తుందా..? లేదా అనేది చూడాలి.
