సీనియర్ హీరోల్లో ఎవరూ చేయని రిస్క్ చేస్తున్నాడు నాగార్జున. నిజానికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఒకే లీగ్‌కి చెందిన హీరోలు. మిగతా హీరోలతో పోలిస్తే నాగార్జునకు చాలా బిగ్గెస్ట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఫ్యామిలీ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి ఆయన రజనీకాంత్ నటిస్తున్న కూలి సినిమాలో నెగిటివ్ పాత్రలో ఒకరకంగా చెప్పాలంటే విలన్‌గా కనిపిస్తున్నాడని వార్త చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం.
Also Read : Pawan Kalyan : స్పీడ్ స్టార్ పవర్ స్టార్.. ఉస్తాద్ ఆల్మోస్ట్ ఫినిష్
దాదాపుగా ట్రైలర్ చూసిన తర్వాత దానికి ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఈ మధ్యనే కుబేర అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన నాగార్జున అందరికీ షాక్ ఇచ్చాడు. తెలుగులో ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరో సినిమాలో ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నాడని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ సినిమా చూసిన తర్వాత ఆ ఆశ్చర్యపైన అందరికీ సమాధానాలు దొరికాయి. ఇప్పుడు కూలి విషయంలో కూడా అదే జరుగుతోంది. తన తోటి హీరోలతో పోలిస్తే చాలా బిగ్ రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అది రిస్కా లేక నాగార్జున చేసింది కరెక్టేనా అనే విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
