NTV Telugu Site icon

Akkineni Nagarjuna: ఎందుకీ మౌనం.. నాగార్జున.. ఇప్పుడైనా మాట్లాడు..?

Sharwa

Sharwa

Akkineni Nagarjuna: ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలో కూడా అందరి బుర్రలను తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న అసలు అక్కినేని నాగార్జునకు ఏమైంది.. ఆయనెందుకు మౌనం వహిస్తున్నాడు.. అందరి మైండ్స్ లోనూ ఇదే రన్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ.. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట తూలిన విషయం తెల్సిందే. అక్కినేని తొక్కినేని అనే మాటను అభిమానులే జీర్ణించుకోలేక వారు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఈ వివాదంపై అక్కినేని వారసులు అఖిల్, చైతన్య కూడా స్పందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు లాంటివారిని కించపరిస్తే మనల్ని మనమే కించపర్చుకోవడమే అని సున్నితంగా కౌంటర్ వేశారు. ఇక అప్పుడు కూడా నాగ్ ఒక్క మాట అన్నది లేదు.. కనీసం ట్విట్టర్ ద్వారా స్పందించింది లేదు. సరే వేరే పనుల్లో బిజీగా ఉండి ఉంటాడులే అని కొందరు.. బాలయ్య మాటలను పట్టించుకోనవసరం లేదని అనుకోని ఉంటాడని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇక ఈ వివాదం ముదిరి అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని వారసులు వరకు వెళ్ళింది. బాలయ్య.. నేడు ఈ వివాదంపై మాట్లాడుతూ “నాగేశ్వరరావు నన్నే ఆప్యాయంగా, ప్రేమగా చూసుకునేవారు.. ఎందుకంటే నాగేశ్వరరావు పిల్లల దగ్గర ఆప్యాయత లేదు, నా దగ్గర ఉంది” అని చెప్పుకొచ్చాడు.

నిజం చెప్పాలంటే ముందు అన్న మాటలు కన్నా ఈ మాటలు అక్కినేని కుటుంబాన్ని అవమానించినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒక తండ్రికి పిల్లలు ఆప్యాయత పంచలేదని, దానికోసం సొంత పిల్లలను వదిలివేరేవారి పిల్లలపై ప్రేమను చూపించారు ఏఎన్నార్ అనే అర్థంలో బాలయ్య మాటలు ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా అక్కినేని నాగార్జున స్పందించకపోతే అది నిజమే అని అభిమానులు అనుకునే ప్రమాదం ఉంది. అయినా నాగ్ లో మాత్రం చలనం లేదు. ఈ వివాదాన్ని పక్కన పెట్టి నేడు హైదరాబాద్ లో జరిగిన హీరో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ కు నాగ్ భార్యతో కలిసి వెళ్లడంతో అక్కినేని అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏమయ్యా నాగార్జున.. తండ్రి వివాదం కన్నా పెళ్లి వేడుక ముఖ్యమా..? ఏదో ఒకటి మాట్లాడు.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈసారైనా నాగ్ నోరు విప్పుతాడో లేదో చూడాలి.