Site icon NTV Telugu

Akkineni Naga Chaitanya: లుక్ అదిరింది.. హిట్ కూడా ఇస్తే బావుంటుంది

Chy

Chy

Akkineni Naga Chaitanya: అక్కినేని హీరోలు ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్యకు ఒక భారీ హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం నాగ చైతన్య.. చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక నాగ చైతన్య మొదటిసారి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చై సరసన సాయి పల్లవి నటిస్తోంది. 2018లో సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గోర్డ్ లకు బందీలుగా చిక్కి దాదాపు ఏడాది పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. వారి జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు చందు మొండేటి. ఇప్పటికే ఈ కథ కోసం శ్రీకాకుళం మత్స్యకారులను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు.

Renjusha Menon: బిగ్ బ్రేకింగ్.. ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య

ఇక ఈ సినిమా కోసం చై లుక్ మార్చాడు. గడ్డం, జుట్టు పెంచి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఒక లోకల్ మత్స్యకారుడుగా నాగచైతన్య రియాలిటీ కి తగ్గట్టుగా తనను తాను చేంజ్ చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇక ఈ లుక్ లోనే చై బయట కనిపించడంతో.. అదే సినిమా లుక్ అని అభిమానులు ఫిక్స్ చేసేస్తున్నారు. ఇక ఈ లుక్ లో చై అదిరిపోయాడు. దీంతో అభిమానులు లుక్ అదిరింది.. హిట్ కూడా ఇస్తే బావుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version