Renjusha Menon: బిగ్ బ్రేకింగ్.. ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renjusha Menon: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటి రెంజూష మీనన్ ఆత్మహత్యకు పాల్పడింది. స్త్రీ అనే సీరియల్ తో రెంజూష మీనన్ కెరీర్ ను ప్రారంభించింది. ఈ సీరియల్ మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. నిజలాట్టం, మగలుడే అమ్మ, బాలామణి వంటి సీరియల్స్ కనిపించి మెప్పించింది. సీరియల్స్ లోనే కాకుండా సినిమాల్లో కూడా తనదైన శైలిలో నటించి అందరి మన్ననలు పొందింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి తరువాత కూడా ఆమె తన నటనను కొనసాగిస్తూనే ఉంది.
Lavanya Tripathi: ఆ విషయంలో నిహారికనే ఫాలో అవుతున్న మెగా కోడలు
Also Read
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
- Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా రీల్స్ చేస్తూ నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. నేడు ఆమె తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణించడానికి కొన్ని గంటల క్రితమే రీల్స్ లో నవ్వుతూ నటించి మెప్పించిన ఆమె.. ఇప్పుడు శవమై కనిపించడం మలయాళ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు. ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని విచారిస్తున్నారు. 35 ఏళ్ల వయస్సులోనే ఆమె మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందని పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!