Site icon NTV Telugu

Instagram: బాలీవుడ్ ఎంట్రీ చైతు కు అలా కలిసొచ్చిందా!?

naga chaitanya

naga chaitanya

ఇవాళ ఫ్యాన్స్ సందడి అంతా తమ ఆరాధ్య హీరో, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో కావడంలో తెలిసిపోతుంది. మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ ఎంచక్కా… దాన్ని మరో రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనూ పడిపోయారు. కమర్షియల్ పోస్టులకు లక్షల్లో అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్లకు ఉన్న ఫాలోవర్స్ తో పోల్చితే హీరోలను ఫాలో అవుతోంది తక్కువ మందే! అందుకు నాగ చైతన్య, అతని మాజీ భార్య సమంత నే ఉదాహరణగా తీసుకోవచ్చు.

అక్కినేని నాగ చైతన్య తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఏడు మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో చైతు కీలక పాత్ర పోషించిన కారణంగా అతన్ని ఫాలో అయ్యే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని తెలుస్తోంది. ఇక సమంత ను ఇన్ స్టాలో ఏకంగా 22.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే చైతు కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఆమెను అనుసరిస్తున్నారన్న మాట. ఇక అక్కినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తక్కువనే చెప్పాలి. ఇన్ స్టాలో అతన్ని 2.6 మిలియన్ల మంది ఫాలో అవుతుంటే, ట్విట్టర్ లో 2.9 మిలియన్లు ఫాలో అవుతున్నారు. కింగ్ నాగార్జున ఇన్ స్టాగ్రామ్ లో లేరు. ట్విట్టర్ లో ఆయన్ని 6.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. చైతు, సమంత ట్విట్టర్ ఫాలోయర్స్ విషయానికి వస్తే… ట్విట్టర్ లో సమంతను 9.5 మిలియన్ల మంది ఫాలో అవుతుంటే, చైతును కేవలం 2.5 మిలియన్ల మందే ఫాలో అవుతున్నారు. అయితే నాగచైతన్యతో పోల్చితే సమంత సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ప్రతి అప్ డేట్ ను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆ పని నాగ చైతన్య చాలా తక్కువ చేస్తాడు. మరీ ముఖ్యమైన విషయం అయితే తప్పితే అతను సోషల్ మీడియా జోలుకు పోడు. అయినా ఇన్ స్టాలో ఏడు మిలియన్ల మైలురాయి దాటాడంటే గ్రేటే!

Exit mobile version