NTV Telugu Site icon

Custody: టీజర్ వస్తుంది… కాస్త ఓపిక పట్టండి…

Custody

Custody

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న మూవీ ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. ఇటివలే కస్టడీ మూవీలో నాగ చైతన్య పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2022లో బాగా డిజప్పాయింట్ చేసిన నాగ చైతన్య, 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. కెరీర్ లో మొదటిసారి మల్టీలాంగ్వేజ్ సినిమా చేస్తున్న నాగచైతన్య, కస్టడీ మూవీ ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాడు. గ్లిమ్ప్స్ తో మెప్పించిన చిత్ర యూనిట్ ‘కస్టడీ’ టీజర్ రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. అక్కినేని అభిమానులు కస్టడీ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చెయ్యడంతో… “మీ ఎగ్జైట్మెంట్ అర్ధం చేసుకోగలను, కస్టడీ టీజర్ వర్క్ జరుగుతుంది. టీజర్ రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తాను. కాస్త ఓపిక పట్టండి” అంటూ దర్శకుడు వెంకట్ ప్రభు ట్వీట్ చేశాడు. మార్చ్ 22న ఉగాది పండగ ఉంది కాబట్టి ఆరోజున కస్టడీ టీజర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

Read Also: Balakrishna: ఇక విజయవాడలో నెక్స్ట్ లెవల్ రాయల్టీ…

ఇదిలా ఉంటే కస్టడీ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ‘అరవింద స్వామి’ విలన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘రాజు’ అనే పాత్రలో వెంకట్ ప్రభు నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. దృవ సినిమాలో అరవింద స్వామి విలన్ గా సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జనరల్ గా వెంకట్ ప్రభు సినిమాల్లో హీరో-విలన్ మధ్య ఎపిసోడ్స్ చాలా ఫ్రెష్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో అరవింద స్వామి దిట్ట కాబట్టి కస్టడీ సినిమాలో నాగ చైతన్య-అరవింద స్వామి ఫేస్ ఆఫ్ సీన్స్ ఆడియన్స్ ని ఎంతగా ఇంప్రెస్ చేస్తాయో చూడాలి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ‘యువన్ శంకర్ రాజా’ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది మే 12న కస్టడీ సినిమా రిలీజ్ కానుంది.

Show comments