Nagarjuna: అరవై రోజుల్లో షూటింగ్… సంక్రాంతినే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున నటిస్తున్న 99వ సినిమా ‘నా సామీ రంగ’. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని చెరిపేయడానికి అక్కినేని నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-డైలాగ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ మూవీ ‘పూరింజు మరియం జోస్’కి రీమేక్. ఇటీవలే రిలీజ్ చేసిన “నా సామీ రంగ” ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ హెయిర్ తో, విలేజ్ లుక్ లో నాగార్జున మాస్ గా కనిపించడంతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లోకి వచ్చారు. గ్లిమ్ప్స్ ఎండ్ లో “ఈ సంక్రాంతికి నా సామీ రంగ” అని నాగార్జున మీసం మెలేసి చెప్పాడు. దీంతో సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది అనే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు కింగ్ నాగ్. గ్లిమ్ప్స్ తో ఈ మధ్య కాలంలో చూడని నాగార్జునని చూపించిన నా సామీ రంగ దర్శకుడు సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ తోనే పెంచేసాడు.
సెప్టెంబర్ చివరికి వచ్చింది, అక్టోబర్-నవంబర్-డిసెంబర్… ఉన్నది కేవలం మూడు నెలలే సంక్రాంతికి సినిమాని ఎలా రిలీజ్ చేస్తారు అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఆ డౌట్స్ ని బ్రేక్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో నా సామీ రంగ సినిమాని యుద్ధప్రాతిపదికన షూట్ చేస్తున్నారట. దాదాపు అరవై రోజులు జెట్ స్పీడ్ లో షూట్ చేసి, అనౌన్స్ చేసినట్లు సంక్రాంతి బరిలో నా సామీ రంగ సినిమాని నిలబెట్టనున్నారు. మరి కింగ్ నాగ్… బంగార్రాజు సినిమా తరహాలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ కొడతారో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!