NTV Telugu Site icon

Bholaa Shankar: అఫీషియల్.. మెగాస్టార్ సినిమాలో అక్కినేని హీరోకి బంపరాఫర్

Bhola Shankar Sushanth

Bhola Shankar Sushanth

Akkineni Hero Confirmed To Play A Key Role In Bholaa Shankar: సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వరుసగా పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. వాటిల్లో భోళా శంకర్ ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో ఓ అక్కినేని హీరో కూడా చేరినట్టు లేటెస్ట్‌గా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆ హీరో మరెవ్వరో కాదు.. సుశాంత్. అతని పుట్టినరోజు సందర్భంగా.. భోళా శంకర్ మేకర్స్ ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఇందులో అతడు కీర్తి బాయ్‌ఫ్రెండ్‌గా కనిపించనున్నాడు.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు.. కస్టడీకి 9మంది నిందితులు

తొలుత హీరోగా మాత్రమే ప్రయత్నాలు చేసిన సుశాంత్.. ఇప్పుడు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు ప్రాధాన్యమున్న క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. ఇదివరకే ‘అల వైకుంఠపురములో’ సుశాంత్ ఓ కీ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే! ఇప్పుడు అతడు ఏకంగా మెగా ఆఫర్ పట్టేశాడు. నిజానికి.. ఈ భోళా శంకర్ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ.. షూటింగ్ జాప్యం అవ్వడంతో వాయిదా వేయక తప్పలేదు. కొత్త రిలీజ్ డేట్‌ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Actress Himaja: నన్ను ఇబ్బందులు పెట్టారు, ఘోరంగా ఏడ్చాను.. హిమజ షాకింగ్ కామెంట్స్

Show comments