అక్కినేని అఖిల్ వైల్డ్ హంట్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉండబోతోందో ఏప్రిల్ 28న థియేటర్లో చూడడం కన్నా ముందు చిన్న సాంపిల్ చూపిస్తాం అంటూ మేకర్స్ ఏజెంట్ ట్రైలర్ ని లాంచ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. కాకినాడలోని ఎంసి లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో రాత్రి 7గంటల 30నిమిషాలుకు గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌ను చాలా వైల్డ్‌గా చేస్తున్నారు. గతంలో ఏ హీరో చేయని సాహసం చేస్తూ అఖిల్… విజయవాడలోని పీవీపీ మాల్ పై నుంచి జంప్ చేస్తూ ట్రైలర్ లాంచ్ టైమ్ పోస్టర్‌ను రివీల్ చేశాడు. దాదాపు 172 ఫీట్ల ఎత్తు నుంచి రోప్స్ సహాయంతో అఖిల్ కిందకు జంప్ చేశాడు. ఈ జంప్ తో అఖిల్ ఏజెంట్ సినిమాకి మంచి బజ్ ని జనరేట్ చేశాడు. ఈ బజ్ ని ట్రైలర్ మరింత పెంచనుంది.
ఇప్పటివరకూ ఏజెంట్ సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ వేరు ట్రైలర్ వేరు. ట్రైలర్ లో విషయం ఉంటేనే, ఆ వైల్డ్నెస్ ని చూపిస్తేనే భారి అంచనాలు ఏర్పడతాయి. గ్లిమ్ప్స్ ఇచ్చిన కిక్ ని ట్రైలర్ తో ఇస్తే చాలు ఏజెంట్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ‘ఏజెంట్’ రన్ టైం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలుగా లాక్ చేశారని సమాచారం. ఇది ఒక కమర్షియల్ సినిమాకి పర్ఫెక్ట్ రన్ టైం అనే చెప్పాలి. రెండున్నర నుంచి రెండు నలబై నిమిషాల వరకూ ఎలాంటి లాగ్ లేకుండా ఫైనల్ కట్ చేస్తే సినిమా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. మరి వైల్డ్ ఏజెంట్ థియేటర్లో ఏం చేస్తాడో చూడాలి.
