NTV Telugu Site icon

AkhilAkkineni Engagement : గ్రాండ్ గా అక్కినేని అఖిల్ – ‘జైనబ్ రావ్‌జీ’ నిశ్చితార్ధం

Sweety

Sweety

అక్కినేని అఖిల్ నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ ఉదయం ఓ శుభ ముహూర్తాన జుల్ఫీ రావ్‌జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ ‘జైనబ్ రావ్‌జీ’తో  చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు అఖిల్. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యాయారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారంగా ప్రకటించారు.  యువ జంటను అభినందించండి అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్‌ చేసారు.

దిల్లీకి చెందిన జైనబ్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ గా కొనసాగుతూనే  సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ గా కూడా పని చేస్తుంది.  అఖిల్ , జైనాబ్ రావ్‌జీ కొన్ని సంవత్సరాల క్రితం కలుసుకున్నారు. అలా వారి పరిచయం కాస్త ప్రేమగా  మారడంతో యువ జంట కొన్నేళ్లుగా  ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఇరు కుటుంబపెద్దలకు తమ ప్రేమను తెలియజేయడంతో అందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు జైనాబ్ ఫ్యామిలీ అంగీకరించడంతో నేడు నాగార్జున నివాసంలో ఆడంబరాలకు దూరంగా నిశ్చితార్థం నిర్వహించారు.

Also Read : Akkineni : చైతు – శోభితల పెళ్లి వేడుక డిజిటల్ రైట్స్ కు భారీ రేట్..?

ఈ ప్రత్యేక సందర్భంలో నాగార్జున అక్కినేని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ   “అఖిల్ తన జీవితంలో తన జీవితంలో   ముఖ్యమైన అడుగు వేయడం, జైనాబ్‌తో  ఒక తండ్రిగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. జైనాబ్‌ మా కుటుంబంలో అడుగుపెట్టడం మాకెంతో సంతోషంగా ఉంది. మా రెండు కుటుంబాలతో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని జరుపుకోవడానికి ఎదురుచూస్తున్నాము ‘ అని అన్నారు. త్వరలో అఖిల్,రావ్‌జీల పెళ్లి తేదీని ఫిక్స్ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా అక్కినేని నాగార్జున మొదటి వారసుడు నాగ చైతన్య , శోభిత ధూళిపాళ్ల ల వివాహం డిసెంబరు 4న గ్రాండ్ గా జరగనుంది.  చైతన్య, అఖిల్ ల వివాహా వేడుకల నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.