Site icon NTV Telugu

Akhil: ఏజెంట్ ట్రైలర్ వస్తోంది… ప్రమోషన్స్ లో ఫైర్ వచ్చింది

Akhil

Akhil

అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘ఏజెంట్’ సినిమా చేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మంచి జోష్ చేస్తున్నారు చిత్ర యూనిట్. స్పై యాక్షన్ సినిమాగా రూపొందిన ఏజెంట్ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ‘రామకృష్ణ’ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసి యూత్ ని ఇంప్రెస్ చేసిన ఏజెంట్, యాక్షన్ సినిమాకి లోకల్ టచ్ ఇచ్చాడు. ఈ సాంగ్ యుట్యూబ్ లో మంచి వ్యూవర్షిప్ రాబడుతోంది. లేటెస్ట్ గా ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఏజెంట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Read Also: Ponniyin Selvan-2: పోనీలే ఇప్పటికైనా చోళులు వస్తున్నారు…

ఏప్రిల్ 18న ఏజెంట్ ట్రైలర్ బయటకి రానుందని కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఇప్పటివరకూ ఏజెంట్ సినిమా నుంచి బయటకి వచ్చిన గ్లిమ్ప్స్ కి, టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు ఇచ్చిన పాజిటివ్ వైబ్స్ ని మించే రేంజులో ట్రైలర్ తప్పకుండ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ట్రైలర్ బయటకి రావడం, ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో ఫైర్ రావడం రెండూ ఒకటే సారి జరుగుతాయి. వైల్డ్ సాలాని ట్రైలర్ లో సురేందర్ రెడ్డి ఎలా చూపిస్తాడు అనే దాన్ని బట్టే ఏజెంట్ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ చూడాలి అంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

Exit mobile version