ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అండ్ బ్రూటల్ ‘స్పై’ని పరిచయం చేస్తూ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఏజెంట్’. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతున్న ఏజెంట్ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. అఖిల్ ఈ మూవీతో పాన్ ఇండియా హిట్ కొడతాడని ఫాన్స్ అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ని మరింత పెంచుతూ మేకర్స్ ‘ఏజెంట్’ సినిమా ప్రమోషన్స్ ని మంచి జోష్ లో చేస్తున్నారు. ఇదే జోష్ ని రిలీజ్ వరకూ మైంటైన్ చేస్తే ఏజెంట్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. బాయ్స్ కోసం బ్రేకప్ సాంగ్ ‘రామకృష్ణ’ని రిలీజ్ చేసి, ఇది మంచి రీచ్ తెచ్చుకుంటూ ఉండగానే ఏజెంట్ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఏజెంట్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఏజెంట్ లో బాలీవుడ్ నుంచి కూడా ఒక వెర్సటైల్ యాక్టర్ ని కాస్ట్ ఇన్ చేశారు. హిందీలో హీరోస్, దస్ కహానియా లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ‘డినో మోరియా’ ఏజెంట్ సినిమాలో ‘ది గాడ్’గా నటిస్తున్నాడు. డినో మోరియా పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. “He is as tough as he looks Introducing the Versatile #DinoMorea as ‘THE GOD’ from #AGENT Brace yourselves to witness his brutal action in CINEMAS FROM APRIL 28th” అంటూ ట్వీట్ చేసి ‘డినో మోరియా’ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో డినో మోరియా హాలీవుడ్ విలన్ రేంజులో కనిపించాడు. మరి డినో మోరియా vs అఖిల్ ఫైట్ ఆడియన్స్ కి ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి.
He is as tough as he looks 🔥
Introducing the Versatile #DinoMorea as 'THE GOD' from #AGENT 💥
Brace yourselves to witness his brutal action in CINEMAS FROM APRIL 28th ❤️🔥#AGENTonApril28th@AkhilAkkineni8 @mammukka @sakshivaidya99 @DirSurender @hiphoptamizha @AnilSunkara1… pic.twitter.com/JIFq76brdv
— AK Entertainments (@AKentsOfficial) April 14, 2023
