Site icon NTV Telugu

Akira Nandan: పవన్ ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్

Akira Nandan Watching Kalki 2898 Ad

Akira Nandan Watching Kalki 2898 Ad

Akira Nandan to debut in a cameo role in OG: పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా ఒక అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే సాధారణంగా హీరోల వారసులు ఉన్నప్పుడు వాళ్లు ఇప్పుడిప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తారా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే పలువురు హీరోలు కొడుకులు ఇంకా హీరోలుగా మారలేదు కానీ చిన్నపాటి అతిథి పాత్రలు చేసి మెప్పించారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని వన్ నేనొక్కడినే సినిమాలో నటించగా అఖిల్ అక్కినేని తన మొదటి సినిమా కంటే ముందే మనం సినిమాలో కనిపించాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ని కూడా ఒక సినిమాలో నటింప చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Abhishek Bachchan : నటితో అఫైర్.. ఐష్ కి విడాకులివ్వనున్న జూ. బచ్చన్?

ఆ సినిమా మరి ఏమిటో కాదు ఓజి. డివివి దానయ్య నిర్మాణంలో సుజిత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక కీలకమైన పాత్ర కోసం అకిరా నందన్ ను నటింపచేయాలని సుజిత్ పవన్ కళ్యాణ్ ను కోరినట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. సుజిత్ ప్లాన్ ప్రకారం అయితే ఈ సినిమా ద్వారా ఆ కీరా నందన్ అతిథి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించబోతున్నారు. ఆకీరా నందన్ ఆయన కుమారుడి పాత్రలోనే కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అఖీరా నందన్ చదువుకుంటున్నాడు. మ్యూజిక్ నేర్చుకునేందుకు అమెరికా వెళ్ళాడు. మరి ఆయన ఈ సినిమాలో నటిస్తాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Exit mobile version