Site icon NTV Telugu

Akira Nandan: కళ్యాణ్ బాబునే చూసినట్టుందయ్యా..

Akira

Akira

Akira Nandan: సాధారణంగా ప్రతి కొడుకు.. తన తండ్రిలానే ఉంటాడు.కొడుకులో ఒకప్పటి తండ్రి కనిపిస్తాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ సేమ్ ఇదే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పవన్ వారసుడు అకీరాలో వింటేజ్ పవన్ కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరో కాకముందు టీనేజ్ లో ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అకీరా అలాగే కనిపిస్తున్నాడు. అకీరా టాలీవుడ్ ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ, మనోడు ఇప్పుడప్పుడే వచ్చేలా కనిపించడం లేదు. అయినా కూడా అకీరా క్రేజ్ తగ్గడం లేదు. నిత్యం రేణు .. కొడుకు చేసే ప్రతి పనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ ఏడాది మెగా సంక్రాంతి సంబురాల్లో అకీరానే ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. టీనేజ్ లో ఉన్న తండ్రిని గుర్తుచేశాడు.

ఇక తాజాగా రేణు.. అకీరా ఫోటోలను షేర్ చేసింది. అందులో రగ్గడ్ గడ్డం.. గాగుల్స్ పెట్టుకొని అకీరా కనిపించాడు. ఇది కాకుండా అకీరా నూనూగు మీసాలతో ఉన్నది, క్లీన్ షేవ్ తో ఉన్నది అంతా వీడియోగా ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ లుక్స్ అన్ని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను గుర్తుచేస్తున్నాయి. తండ్రి కొడుకుల ఫోటోలను పక్కన పెట్టి.. అభిమానులు లైక్ ఫాదర్.. లైక్ సన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అకీరాను చూస్తుంటే ఖుషిలో పవన్ గుర్తురాకమానడు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు జూనియర్ పవన్.. హీరోగా మారతాడు అని ఎదురుచూస్తున్నారు. మరి ఈ జూనియర్ పవర్ స్టార్ ఎప్పుడు రంగంలోకి దిగుతాడో చూడాలి.

Exit mobile version