Akhil Akkineni : అయ్యగారితో మారుతీ చర్చలు.. ఇద్దరికీ హిట్ కంపల్సరీ

Akhil Maruthi

Akhil Maruthi

అక్కినేని వారసుడు అఖిల్ తన కెరీర్ విషయంలో ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఏజెంట్’ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చడంతో, ఈసారి కచ్చితంగా కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ తన తదుపరి చిత్రం లెనిన్ పనుల్లో బిజీగా ఉండగా సోషల్ మీడియాలో మరో క్రేజీ కాంబో గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 Also Read : Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మారుతితో అఖిల్ నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఇప్పటికే చర్చలు జరిగినట్లు సమాచారం. మారుతి గతంలో అక్కినేని నాగచైతన్యతో చేసిన శైలజారెడ్డి అల్లుడు కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని హీరోల బాడీ లాంగ్వేజ్‌ను మారుతి డీల్ చేసిన విధానం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో, అఖిల్ కోసం కూడా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌ను మారుతి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మారుతి మాత్రమే కాకుండా అఖిల్ మరికొందరు యువ దర్శకులతో కూడా కథలు వింటున్నట్లు టాక్. మారుతి లాంటి మినిమం గ్యారెంటీ దర్శకుడితో సినిమా చేయడం వల్ల అఖిల్‌కు మాస్ ఆడియన్స్‌లో మంచి రీచ్ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ‘రాజా సాబ్’ తో భారీ డిజాస్టర్ అందుకున్న మారుతి ఒక  బ్లాక్ బస్టర్ హిట్ తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి మారుతి కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే అక్కినేని అభిమానులకు పండగే అని చెప్పాలి.