అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో ఏప్రిల్ 28న థియేటర్లో బుల్లెట్ల వర్షం రాబోతోందని తుఫాన్ హెచ్చరిక ఇచ్చేశారు. ట్రైలర్ తో అంచనాలు పెరగడం కాదు గ్లిమ్ప్స్ నుంచే ఏజెంట్ మూవీలో భారి యాక్షన్ ఉంటాయని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు. ‘వైల్డ్ సాలే’గా అఖిల్ చేసే యాక్షన్స్ సీక్వెన్స్ లను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు అఖిల్. మొన్ననే వరంగల్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అఖిల్ నిజంగానే ప్రమోషన్స్‌లో వైల్డ్‌లా బిహేవ్ చేస్తున్నాడు. అగ్రెసివ్ గా డూ ఆర్ డై అన్నట్లు ఏజెంట్ సినిమాని ప్రమోట్ చేస్తున్న అఖిల్, ఎక్కడ చూసిన ఏజెంట్ సినిమా గురించి మాత్రమే మాట్లాడుకునేలా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో అఖిల్ కష్టానికి ఫలితం దక్కుతుందా లేదా అనే టెన్షన్ కొందరిలో ఉంది. ఎప్పుడైతే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో, అప్పటినుంచే ఏజెంట్ సినిమాపై ఉన్న అనుమానాలు అన్ని ఎగిరిపోయాయి.
Read Also: Boyapati Srinu: ఆయన్ని చూడగానే మాస్ ఆడియన్స్ ఒక్కసారిగా ‘జై’ అని లేస్తారు
ఏజెంట్ ప్రీ బుకింగ్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ఈ సినిమాకు సెన్సార్ టాక్ అదిరిపోయింది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఏజెంట్. సెన్సార్ బోర్డ్ ఏజెంట్‌కు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలుగా లాక్ చేశారు. ఒక పర్ఫెక్ట్ కమర్శియల్ సినిమాకి ఇది పర్ఫెక్ట్ రన్ టైం అంటున్నారు అక్కినేని అభిమానులు. రెండు గంటల నలబై నిమిషాల నిడివి ఉన్న సినిమాలు సూపర్ హిట్స్ అయిన హిస్టరీ టాలీవుడ్ లో చాలానే ఉంది. ఇక సెన్సార్ నుంచి ఏజెంట్‌కు పాజిటివ్ టాక్ వస్తోంది. సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమా చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని అంటున్నారట. దీంతో థియేటర్లో బుల్లెట్ల వర్షం ఖాయమంటున్నారు. కళ్యాణ్ రామ్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకి సూపర్ హిట్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి, అఖిల్‌కు ఎలాంటి హిట్ అనేది ఇంటరెస్టింగ్ విషయం. ఇక్కడ పాన్ ఇండియా హిట్ కొట్టిన తర్వాత అఖిల్ పాన్ ఇండియా రిలీజ్ కి ఎంత గ్యాప్ తో వెళ్తాడు అనేది చూడాలి.
