Lenin Review : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓవర్శీస్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం లెనిన్. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా ఎలావుందంటే.. సినిమా ప్రారంభమే బలమైన కథా నేపథ్యం, ఆసక్తికరమైన పాత్రలతో దర్శకుడు సినిమాను ఒక స్ట్రాంగ్ నోట్లో సెటప్ చేశాడు. వీటన్నింటికీ మించి గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి ఊహించని సర్ప్రైజ్. ఎన్టీఆర్ తన గంభీరమైన వాయిస్‌తో కథను పరిచయం చేయడం ప్రేక్షకులను క్షణాల్లో కథలోకి తీసుకువెళ్తుంది. అయితే బలహీనమైన ప్రేమకథ మరియు రొటీన్ కమర్షియల్ అంశాల వల్ల సినిమా త్వరగానే పట్టు కోల్పోతుంది. ఫస్ట్ హాఫ్ మధ్యలోకి వచ్చేసరికి కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే లవ్ ట్రాక్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది.
కథలో మంచి డ్రామా పండించడానికి స్కోప్ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల ఎమోషన్స్ పూర్తిగా పండలేదు. కానీ ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ నుండి మళ్లీ పుంజుకుంటుంది. థమన్ ఇచ్చిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, దర్శకుడు డిజైన్ చేసిన ఇంటర్వెల్ బ్యాంగ్ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి హై ఇస్తాయి. ఈ ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై భారీ అంచనాలను పెంచడమే కాకుండా సినిమాను తదుపరి భాగం ఎటు తీసుకెళ్తుందనే క్యూరియాసిటీని పెంచుతుంది.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ఇక సెకండాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. కథనం కూడా ఆంటే స్థాయిలో సాగుతూ ఊహించని మలుపులతో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే ఒక బ్లాక్‌బస్టర్ సినిమాలోని హీరో తరహా రూపంలో విలన్ చూపించే క్రూరత్వం, ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాలకు మంచి బలాన్ని చేకూర్చాయి. సినిమాలోని అత్యంత కీలకమైన సన్నివేశంలో అఖిల్ నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ సన్నివేశంలో నేపథ్య సంగీతం ఉండదు కెమెరా పనితీరులో సినిమాటిక్ హంగులు ఉండవు ఆ సన్నివేశం పూర్తిగా అఖిల్ అద్భుతమైన యాక్టింగ్ మాత్రమే కనిపిస్తుంది.
ఓవరాల్‌గా చెప్పాలంటే: ఈ చిత్రానికి ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్లాక్స్ ప్రధాన బలాలుగా నిలిచాయి. అఖిల్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్. కానీ ఫస్టాఫ్ స్లో ఫీల్స్, లవ్ స్టోరీలో ఎమోషన్ లోపించడం, స్క్రీన్‌ప్లే అక్కడక్కడా తడబడటం, రొటీన్ టెంప్లెట్ ఫార్మేట్ లో సాగె కథనం లెనిన్ ను సాధారణ సినిమాగా నిలబెట్టాయని ఓవర్సీస్ ఆడియెన్స్ అభిప్రాయం.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!