Site icon NTV Telugu

Akhil Akkineni: సినిమాల ఎంపిక విషయంలో తన తాతయ్య చెప్పింది ఫాలో అవబోతున్న అఖిల్..?

Whatsapp Image 2023 06 24 At 11.21.39 Pm

Whatsapp Image 2023 06 24 At 11.21.39 Pm

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం లో గెస్ట్ రోల్ అదరగొట్టిన అఖిల్.ఆ తర్వాత అఖిల్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు..కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హలో సినిమాలో నటించాడు. ఈ సినిమా కొంత మెప్పించిందని చెప్పాలి. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తే ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.తరువాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.కానీ ఆ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు మరియు హీరోయిన్ కే వెళ్ళింది.ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటించాడు. ఈ సినిమా కోసం బాగా హైప్ ను క్రియేట్ చేశాడు.కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా చూసిన వారంతా అఖిల్ ఇలాంటి సినిమాను ఎందుకు తీసాడు అంటూ విమర్శలు చేసారు..సోషల్ మీడియాలో అఖిల్ పై భారీగా విమర్శలు వచ్చాయి.. ఏజెంట్ సినిమా ప్లాప్ కావడంతో అఖిల్ కెరీర్ డైలామాలో పడింది. ఎలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో అని తెగ ఆలోచిస్తున్నాడు.అఖిల్ చేసిన సినిమాలన్నీ కూడా కథ పరంగా ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోయాయి. అందుకే ఆ సినిమాలన్నీ కూడా ప్లాప్ గా నిలిచాయి..

అఖిల్ మొదటి నుంచి సినిమాల ఎంపిక విషయంలో తొందరపడటం వల్ల ఇలా అవుతుందని అతని సన్నిహితులు చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ అఖిల్ మాత్రం వచ్చిన సినిమాలని చేసుకుంటూ పోవటం వల్ల అవి ప్రేక్షకులకు నచ్చడం లేదు.అయితే ఎలాంటి సినిమాను చేయాలి అనే సందేహంలో ఉండగా అఖిల్ కు తన తాత అక్కినేని నాగేశ్వరరావు గారి మాటలు గుర్తుకు వచ్చాయి.సినిమాల పరంగా ప్రేక్షకుల మనసు దోచేయాలని తన చిన్నతనం లో సలహాలు ఇచ్చేవారట. దీనితో కథలో బలం ఉండాలని తెలుసుకున్నాడు అఖిల్ ..మంచి కధలను ఎంపిక చేసుకొని డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలను చేయాలనుకుంటున్నాడు అఖిల్.అటువంటి కథలను ఎంచుకొని తానే నిర్మించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Exit mobile version