Site icon NTV Telugu

Akhil: అయ్యగారు వస్తున్నారు… అక్కినేని అభిమానులు ఈవెంట్ కి వెళ్లిపోండి

Akhil

Akhil

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాష్మీర హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 18న రిలీజ్ అవ్వనున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ‘ఫోన్ నంబర్ నైబర్స్’ అనే ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది. ప్రమోషన్స్ ని మంచి జోష్ లో చేస్తున్న చిత్ర యూనిట్, లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘చుక్కలెత్తు కొండలే’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ డిజైన్ చేసిన విధానం ఆకట్టుకునేల ఉంది. సిట్యువేషనల్ సాంగ్ కాబట్టి లిరికల్ సాంగ్ కన్నా వీడియో సాంగ్ గానే బాగుండే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. త్వరలో జరగనున్న వినరో భాగ్యము విష్ణు కథ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అఖిల్ అక్కినేని చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు.

అయ్యగారు వస్తున్నారు అంటూ అక్కినేని అభిమానులు, కిరణ్ అబ్బవరం సినిమా ఫంక్షన్ లో సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నారు. అఖిల్ కి మొదటి హిట్ ఇచ్చిన గీత ఆర్ట్స్ బ్యానర్ కాబట్టి ఆ రిలేషన్ తోనే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా రావడానికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఉన్నాడు. ఇదిలా ఉంటే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఆ రోజు సితార ఎంటర్తైన్మెంట్స్ నుంచి ధనుష్ ‘సార్’ వస్తుండడంతో బన్నీ వాసు అండ్ టీం వినరో భాగ్యము విష్ణు కథ సినిమాని ఒక్క రోజు వాయిదా వేశారు.

Exit mobile version