NTV Telugu Site icon

Akhil Akkineni: అయ్యగారికి ఆ హీరోయినే కావాలంట.. ?

Akhil

Akhil

Akhil Akkineni: అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని కుటుంబం నుంచి వారసుడిగా అఖిల్ సినిమాతో ఎంటర్ అయ్యాడు. ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ అఖిల్ కు మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత వరుసగా ఇండస్ట్రీపై విజయం కోసం అయ్యగారు యుద్ధం చేస్తున్నాడు. కానీ అఖిల్ కు మాత్రం విజయం మాత్రం దక్కలేదు. ఇక ఎట్టకేలకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ మొదటి హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఏజెంట్ సినిమాతో అభిమానులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎంతటి డిజాస్టర్ ను తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. అయినా సరే అఖిల్ ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ధీర.

Girija Shetter: నాగార్జునకు ఏకధాటిగా లిప్ కిస్ పెట్టిన హీరోయిన్.. ఇలా మారిపోయింది ఏంటీ ..?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ ఈ చిత్రం ఆల్రెడీ ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసిందని టాక్. ఇకపోతే ఈ సినిమా కోసం అఖిల్ తనకు లక్కీ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే కావాలని కోరుతున్నాడట. పూజ హెగ్డే, అఖిల్ జంటగా మాస్టర్ బ్యాచిలర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే అఖిల్ మొదటి హిట్ ను అందుకున్నాడు. దీంతో మరోసారి ఆ హిట్ కాంబో రీపీట్ అయితే మరో హిట్ ను అందుకొనే ఛాన్స్ ఉంటుంది అనే నమ్మకంతో పూజాను తీసుకోవాలని కోరాడట. అయితే అఖిల్ కు పూజా లక్కీ ఛార్మ్ కావచ్చు.. కానీ, రెండేళ్ల నుంచి పూజాకు హిట్ లేదు. దీంతో పూజాను తీసుకోవడానికి మేకర్స్ జంకుతున్నారని టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

Show comments