Lenin 3 days collection : లెక్క మారింది.. అఖిల్ 2.O మాస్ బ్యాటింగ్

Lenin

Lenin

అక్కినేని అభిమానులు ఎంతో కాలంగగా ఎదురు చూస్తున్న సమయం ఇది. కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ హిట్ కోసం తపిస్తున్న అఖిల్‌కు లెనిన్ మాసివ్ హిట్ ఇచ్చింది. ఎలాగైనా సరే అఖిల్‌కు హిట్ ఇవ్వాలని డిసైడ్ అయిన నాగార్జున అనుకున్నట్టే కొడుక్కి సూపర్ హిట్ ఇచ్చేశాడు. ఈ సందర్భంగా తండ్రీ కొడుకులు ఎమోషనల్ అయిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలలో లెనిన్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా ఉంది. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

మొదటి రోజు 16.7 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండు రోజుల్లోనే 37.2 కోట్లు కొల్లగొట్టింది. ఇక మూడు రోజుల్లో మాస్ ర్యాంపేజ్ చూపించాడు అఖిల్. మొత్తంగా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. తన కెరీర్లోనే హైయెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.. సితార సంస్థ చెప్పినట్టే ఇక నుంచి అక్కినేని అభిమానులు అఖిల్‌ 2.0 చూడాలనుకుంటున్నారు. గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే.. ఇక నుంచి అఖిల్ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. నిజానికి అఖిల్ కటౌట్‌కి ఈపాటికే పాన్ ఇండియా రేంజ్‌లో ఉండాల్సింది. కానీ కాలం కలిసి రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు లెనిన్ రూపంలో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటి నుంచి అఖిల్ కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు చేస్తే.. పాన్ ఇండియా స్టార్ లిస్ట్‌లో చేరడానికి ఎక్కువ సమయం పట్టదు. మరి అఖిల్ ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి. కాగా లెనిన్‌ సినిమాతో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా మొదటి విజయాన్ని అందుకుంది.