Site icon NTV Telugu

HBD Akhil Akkineni : “ఏజెంట్” బ్లాస్టింగ్ బర్త్ డే పోస్టర్

Agent

Agent

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్‌తో జోరు మీదున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమాలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈరోజు అక్కినేని వారసుడు అఖిల్ పుట్టిన రోజు. ఈ ప్రత్యేక సందర్భంలో “ఏజెంట్” నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ బీస్ట్ మోడల్ లో సిగరెట్ తాగుతూ తీక్షణంగా చూస్తున్నాడు.

Read Also : The Ghost : మ్యాజికల్… లొకేషన్ పిక్ షేర్ చేసిన డైరెక్టర్

“వైల్డ్ వన్ వైల్డ్ హంట్… అఖిల్ అక్కినేని బర్త్ డే బ్లాస్ట్ పోస్టర్… హ్యాపీ బర్త్ డే” అంటూ అఖిల్ కు టీం ఈ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు ఈ సినిమాలో అఖిల్‌ నుంచి విడుదలైన లుక్స్ లో ఇదే బెస్ట్ లుక్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశభక్తి అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ కు జంటగా నటి సాక్షి వైద్య నటిస్తున్నారు. ఆగస్ట్ 12న విడుదల కానున్న ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో మమ్ముట్టి కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.

Exit mobile version