NTV Telugu Site icon

Akhil Akkineni: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో.. వీటికి దూరంగా వెళ్లిపో

Akhil

Akhil

Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అక్కినేని నటవారసుడుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. కూడా అయ్యగారి లక్ మాత్రం కలిసి రావడం లేదు. రీ..రీ… రీ లాంచ్ లు చేస్తున్నా అఖిల్ కు స్టార్ హీరో అనే హోదా మాత్రం దక్కలేదు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కాస్తోకూస్తో విజయాన్ని అందుకున్న అఖిల్ తన ఆశలన్నీ.. ఏజెంట్ మీదనే పెట్టుకున్నాడు. తిండి, నిద్ర మానేసి రెండేళ్లు ఆ సినిమా కోసం కష్టపడ్డాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో ఆశలతో థియేటర్ లోకి వెళ్లిన ప్రేక్షకుడు నీరుగారిపోయి బయటకు వచ్చాడు. సినిమాలో చాలా లోపాలు ఉన్నాయని నిర్మొహమాటముగా ముఖం మీదనే చెప్పుకొచ్చేశారు అభిమానులు. ఇక సినిమా రిలీజ్ దగ్గరనుంచి అఖిల్ ను, సురేందర్ రెడ్డి ని ట్రోలర్స్ ఆడేసుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర.. ఆ నిందను తనపై వేసుకొని అభిమానులను క్షమించమని కోరడంతో కొద్దిగా వాతావరణం సద్దుమణిగింది.

OG Update : పవన్ ‘ట్రిపుల్ పవర్’.. తట్టుకోవడం కష్టమే

ఇక భారీ డిజాస్టర్ టాక్ అందుకున్న ఏజెంట్.. ప్రస్తుతం ఓటిటీలోకి అడుగుపెట్టడానికి సిద్దమవుతుంది. సినిమా రిలీజ్ అయిన వారంరోజులకే ఓటిటీ డేట్ ను ప్రకటించిన ఏకైక సినిమా ఏజెంట్ అని చెప్పాలేమో. సాధారణంగా థియేటర్ లో హిట్ అవ్వని సినిమాలను సైతం ఓటిటీలో ప్రకటించాలంటే కనీసం రెండు మూడు వారాల సమయం తీసుకుంటారు. కానీ, అఖిల్ ఏజెంట్ మాత్రం కేవలం వారంలోనే ఓటిటీ డేట్ ప్రకటించి షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. మే 19 నుంచి ఏజెంట్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక మరోపక్క ఈ ట్రోల్స్, ఈ గోల భరించలేక.. అయ్యగారు వెకేషన్ కు చెక్కేశారు. ఈ విషయం తెలియడంతో అభిమానులు, అఖిల్ పై సానుభూతిని చూపిస్తున్నారు. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో .. అని కొందరు.. కొన్నిరోజులు వీటికి దూరంగా వెకేషన్ కు వెళ్ళిపో బ్రో అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక అయ్యగారు తన తదుపరి సినిమాతోనైనా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో ఎదురుచూడాల్సిందే.