అఖిల్ కి ఈ క్రిస్టమస్ అయినా కలసి వస్తుందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా ఈ డిసెంబర్ లో రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యాడు. రా ఏజెంట్ గా పాత్రలో పరకాయ ప్రవేశం చేయటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఏజెంట్’ గా అతని లుక్ అందరినీ ఆకట్టకుంది. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ లుక్ అనిపించుకుంది. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయటానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Read Also: రివ్యూ: రాజ రాజ చోర
Also Read
నిజానికి క్రిస్టమస్ సీజన్ నాగ్ కి అచ్చివచ్చిందని చెబుతుంటారు. ‘మన్మథుడు, మాస్’ సినిమాలు ఈ సీజన్ లోనే విడుదలై చక్కటి విజయాన్ని సాధించాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ‘డాన్, కింగ్, రగడ, రాజన్న, ఢమరుకం’ మాత్రం నాగార్జునకు నిరాశనే మిగిల్చాయి. ఇక అఖిల్ సైతం ఓ సారి ఇదే సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటించిన ‘హలో’ సినిమా క్రిస్టమస్ కే విడుదలై పరాజయం పాలయింది. ఇప్పుడు మరోసారి ఈ సీజన్ ను నమ్ముకుని ముందడుగు వేస్తున్నాడు అఖిల్. ‘ఏజెంట్’ హై బడ్జెట్ స్పై డ్రామా. వక్కంతం వంశీ రాసిన కథకు సురేందర్ రెడ్డి ట్రీట్ మెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గతంలో వక్కంతం, సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన ‘కిక్, రేసు గుర్రం’ బ్లాక్ బస్లర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో ఈ కాంబినేషన్ మూవీపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాను ఎకెఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ముందు అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ విడుదల కావలసి ఉంది. మరి ఈ రెండు సినిమాలతోనైనా నాగార్జున చిన్నబ్బాయి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

తాజావార్తలు
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!
-
Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
-
Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
-
India vs New Zealand: కివీస్ గడ్డపై తెలుగోళ్ల విధ్వంసం.. భారత్ ఖాతాలో మరో రికార్డ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!