అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఏజెంట్’. మోస్ట్ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో సాక్షి వాద్య హీరోయిన్ గా నటిస్తోంది. హిప్ హాప్ తమిళ, రసూల్ ఎల్లోరా, నవీన్ నూలి లాంటి మోస్ట్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్న ఏజెంట్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు. టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏజెంట్ మూవీ మేకర్స్, ఒక వైడ్ రైడ్ లాంటి మూవీ రాబోతుంది అనే హింట్ ఇచ్చేశారు. ఏజెంట్ కోసం కంప్లీట్ మేకోవర్ అయిన అఖిల్, లాంగ్ హెయిర్ అండ్ సిక్స్ ప్యాక్ తో రాక్ సాలిడ్ గా ఉన్నాడు. బాలీవుడ్ హీరో రేంజులో ఉన్న అఖిల్, ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా హీరో అవుతాడని అక్కినేని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
వైల్డ్ సాలాగా అఖిల్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి 2021 డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకి వస్తాడు అనుకుంటే అక్కడి నుంచి పోస్ట్ పోన్ అయ్యి గతేడాది ఆగస్ట్ 12ని రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. ఈ టైంలో కూడా విడుదల చెయ్యకుండా ఏజెంట్ సినిమాని 2023 సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి తెస్తాం అని మేకర్స్ అనౌన్స్ చేశారు. చెప్పినట్లుగానే ఏజెంట్ సినిమాని ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి తెస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక వీడియోని వదిలారు. ఇందులో అఖిల్ ని ఎవరో కట్టేసి కొడుతుంటే అఖిల్ బేర్ బాడీతో రగ్గడ్ గా ఉన్నాడు. లాస్ట్ షాట్ లో “సాలా నై… వైల్డ్ సాలా బోల్” అనే డైలాగ్ ని చెప్పి మరోసారి తన క్యారెక్టర్ ఇంటెన్సిటీ ఏ రేంజులో ఉంటుందో చూపించాడు. రిలీజ్ డేట్ బయటకి వస్తుందేమో కానీ ఇలా వీడియో బయటకి వస్తుందని ఊహించని అక్కినేని అభిమానులు, సోషల్ మీడియాలో #wildsaala #agent అనే టాగ్స్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.
The #WildSaala is set to take you all on a wild ride in theatres 🤙#AGENT WorldWide Release on 28th April 2023🔥
– https://t.co/IHpWdERoyd#AgentonAPRIL28th 💥💥@AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AnilSunkara1 @S2C_Offl @LahariMusic pic.twitter.com/1cNZzr8NKV
— AK Entertainments (@AKentsOfficial) February 4, 2023
