నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “అఖండ” తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్ సాధించి రికార్డుల మోత మోగిస్తోంది. సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని చోట్లా భారీ కలెక్షన్లను వసూలు చేసింది. చాలా రోజుల తరువాత బాలయ్య ఫ్యాన్స్ సినిమాను చూసి ‘అఖండ’ జాతర జరుపుకున్నారు. అయితే ఇప్పుడు కేవలం యూఎస్ఏలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను చూడాలని తహతహలాడుతున్నారు. అందుకే మేకర్స్ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చారు.
Read Also : మత్తు చల్లి మాయ చేసిన ఎల్.ఆర్.ఈశ్వరి!
ఇప్పుడు పారిస్‌లో నివసిస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేక షోను ప్లాన్ చేశారు. ఈ చిత్రం ఈరోజు రాత్రి 07:45 (స్థానిక కాలమానం ప్రకారం)కి పారిస్‌లోని పాథే లా విల్లెట్ సినిమా వద్ద ప్రదర్శితం కానుంది. ప్రత్యేక స్క్రీనింగ్ కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అక్కడి ప్రేక్షకుల కోసం ఇప్పుడు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ మేకా, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ముఖ్య పాత్రలు పోషించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందించారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.