Akhanda 2 : “అఖండ 2 తాండవం” సాంగ్ డేట్ ఫిక్స్! థమన్ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌కి వేరే లెవెల్ హై ఉంటుంది. ఈ జంట నుంచి వచ్చే ప్రతి సినిమా పవర్‌ప్యాక్ యాక్షన్, ఎమోషన్‌తో భారీ అంచనాలు తెచ్చుకుంటుంది. ఇప్పుడు అదే తరహాలో వస్తోన్న ప్రాజెక్ట్ “అఖండ 2: తాండవం” పై అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయిలో ఉంది. మొదటి భాగం అఖండ సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత, సీక్వెల్ పై నమ్మకం మరింతగా పెరిగింది.
Also Read : Sreeleela : ఫెయిల్యూర్స్‌కి ఫుల్స్టాప్.. ‘పరాశక్తి’తో తిరిగి ఫామ్‌లోకి శ్రీలీల..
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. మాస్ బీట్లతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే “తాండవం” సాంగ్ ప్రోమోను మేకర్స్ నవంబర్ 7న రిలీజ్ చేయబోతున్నారని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు దాని పూర్తి సాంగ్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సంగీత దర్శకుడు థమన్ తన సోషల్ మీడియా ద్వారా “అఖండ 2 తాండవం ఫుల్ సాంగ్ నవంబర్ 9న వస్తుంది!” అని క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఈ అప్డేట్ను ఇవ్వగానే బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. థమన్ స్వరపరిచిన ఈ పాటలో బాలకృష్ణ ఎనర్జీ, బోయపాటి ట్రీట్ రెండూ కలిసే ఉంటాయని యూనిట్ చెబుతోంది. ఈసారి “తాండవం” సాంగ్ మొదటి భాగంలోని “జై బాలయ్య” సాంగ్‌కి సరిపడే మాస్ ఫీలింగ్ ఇవ్వబోతుందట. బాలయ్య శక్తివంతమైన డైలాగ్స్, థమన్ రాకింగ్ బీట్లు కలిసి తెరపై అలజడి సృష్టించనున్నాయి.
14 రీల్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఈ భారీ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండగా, సంయుక్తా మరియు హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ విజువల్స్, మిస్టిక్ బ్యాక్‌డ్రాప్, బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సీక్వెల్‌ని ఇంకా స్పెషల్ చేయనున్నాయి. ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. “అఖండ 2 తాండవం” డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి బాలయ్య ఎలాంటి తాండవం చేయబోతున్నారో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
#ShankarMahadevan 🔱 #KailashKher 🔱🙌🏿🔥
One of Massively Produced Track ON ITS JOURNEY
A-K-H-A-N-D-A-T-H-A-N-D-A-V-A-M #Akhanda2FirstSinglePROMO ON – 7 th NOV
FULL SONG – 9 th NOV #JaiBalayya 🦁 pic.twitter.com/qt7fN3Ok8C— thaman S (@MusicThaman) November 5, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!