Site icon NTV Telugu

Akhanda 2 : “అఖండ 2 తాండవం” సాంగ్ డేట్ ఫిక్స్‌! థమన్ ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌

Akanda2

Akanda2

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్‌ ఆడియన్స్‌కి వేరే లెవెల్‌ హై ఉంటుంది. ఈ జంట నుంచి వచ్చే ప్రతి సినిమా పవర్‌ప్యాక్‌ యాక్షన్‌, ఎమోషన్‌తో భారీ అంచనాలు తెచ్చుకుంటుంది. ఇప్పుడు అదే తరహాలో వస్తోన్న ప్రాజెక్ట్‌ “అఖండ 2: తాండవం” పై అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయిలో ఉంది. మొదటి భాగం అఖండ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన తర్వాత, సీక్వెల్‌ పై నమ్మకం మరింతగా పెరిగింది.

Also Read : Sreeleela : ఫెయిల్యూర్స్‌కి ఫుల్‌స్టాప్‌.. ‘పరాశక్తి’తో తిరిగి ఫామ్‌లోకి శ్రీలీల..

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సేషనల్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. మాస్‌ బీట్‌లతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే “తాండవం” సాంగ్‌ ప్రోమోను మేకర్స్‌ నవంబర్‌ 7న రిలీజ్‌ చేయబోతున్నారని ఇప్పటికే కన్ఫర్మ్‌ చేశారు. ఇప్పుడు దాని పూర్తి సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ అయిపోయింది. సంగీత దర్శకుడు థమన్‌ తన సోషల్‌ మీడియా ద్వారా “అఖండ 2 తాండవం ఫుల్‌ సాంగ్‌ నవంబర్‌ 9న వస్తుంది!” అని క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఈ అప్‌డేట్‌ను ఇవ్వగానే బాలయ్య అభిమానులు సోషల్‌ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. థమన్‌ స్వరపరిచిన ఈ పాటలో బాలకృష్ణ ఎనర్జీ, బోయపాటి ట్రీట్‌ రెండూ కలిసే ఉంటాయని యూనిట్‌ చెబుతోంది. ఈసారి “తాండవం” సాంగ్‌ మొదటి భాగంలోని “జై బాలయ్య” సాంగ్‌కి సరిపడే మాస్‌ ఫీలింగ్‌ ఇవ్వబోతుందట. బాలయ్య శక్తివంతమైన డైలాగ్స్‌, థమన్‌ రాకింగ్‌ బీట్‌లు కలిసి తెరపై అలజడి సృష్టించనున్నాయి.

14 రీల్‌ ప్లస్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ఈ భారీ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండగా, సంయుక్తా మరియు హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ విజువల్స్‌, మిస్టిక్‌ బ్యాక్‌డ్రాప్‌, బోయపాటి మార్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఈ సీక్వెల్‌ని ఇంకా స్పెషల్‌ చేయనున్నాయి. ఇక సినిమా రిలీజ్‌ విషయానికి వస్తే.. “అఖండ 2 తాండవం” డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి బాలయ్య ఎలాంటి తాండవం చేయబోతున్నారో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

Exit mobile version