Site icon NTV Telugu

Akhanda-2 : అఖండ-2 రిలీజ్ అప్పుడేనా..?

Akhanda

Akhanda

Akhanda-2 : బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ అఖండ-2. అప్పట్లో వచ్చిన అఖండ మూవీ భారీ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ-2 టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన లుక్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించిన టీమ్.. ఆ తర్వాత వాయిదా వేసింది. మూవీ వీఎఫ్‌ ఎక్స్ పనులు మరింత క్వాలిటీగా రెడీ చేస్తున్నామని.. అందుకే లేట్ అవుతున్నట్టు తెలిపింది. కానీ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.

Read Also : OG : ఓజీ ప్రమోషన్లకు పవన్ కల్యాణ్‌ దూరం..?

అక్టోబర్ లో సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. మూవీకి పెండింగ్ పనులు బాగానే ఉన్నాయంట. పైగా ఈ సినిమాలో వీఎఫ్ ఎక్స్ ను భారీగా వాడుతున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే నవంబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. బాలకృష్ణ అఘోరా పాత్ర ఈ సినిమాకే హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్ర వేరియేషన్స్ వేరే లెవల్లో ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

Read Also : Ghaati : శభాష్ అనుష్క.. వాళ్లందరి నోర్లు మూయించిందిగా

Exit mobile version